ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యుడీఐడీ నంబర్‌ పై అవగాహన కల్పించాలి

ABN, Publish Date - May 06 , 2025 | 11:49 PM

ప్రతీ దివ్యాంగుడికి యుడీఐడీ నం బర్‌పై అవగాహన కల్పించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో డాక్టర్‌ అన్న ప్రసన్నకుమారి, జడ్పీ సీఈఓ నరేందర్‌లతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పెద్దపల్లిటౌన్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రతీ దివ్యాంగుడికి యుడీఐడీ నం బర్‌పై అవగాహన కల్పించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో డాక్టర్‌ అన్న ప్రసన్నకుమారి, జడ్పీ సీఈఓ నరేందర్‌లతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఆర్‌డీవో మాట్లాడుతూ అక్టోబర్‌ 31, 2023 నాటికి జారీ చేసిన సదరం సర్టిఫికెట్లకు యుడీఐడీ నంబర్‌ జనరేట్‌ చేసి దివ్యాం గులకు పంపిణీ చేశామన్నారు. ఎవరికైనా లేనిపక్షంలో ఆధార్‌ లేదా మొబైల్‌ నంబర్‌ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఐడీ కార్డు లేని దివ్యాంగులు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదిస్తే జనరేట్‌ చేస్తారని తెలిపారు. నూతనంగా యుడీఐడీ కార్డుల కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసుపత్రిలో నిర్దారణ పరీక్షలు నిర్వ హించిన తర్వాత ఐడీ కార్డు జనరేట్‌ చేయాలని సూచించారు. కార్డుల జారీ, వాటి వినియోగంపై దివ్యాంగులకు ఉన్న సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఎంపీడీవోలు, భవిత సెంటర్‌ నిర్వాహకులు, దివ్యాంగులు, పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

సుల్తానాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ది అఽధికారి కాళిందిని దేవి నిర్వాహకులను, ఏపీఎంలను ఆదేశించారు. మంగళవారం గర్రెపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఏ రోజు ఎంత మేరకు కొనుగోళ్ళు జరుగుతున్నాయో, మిల్లులకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యాన్ని తరలించారు. ఇంకా సెంటర్‌లో ఏ మేరకు దాన్యం నిలువ ఉందన్న వివరాలను తెలుసుకున్నారు. అనంతరం డీఆర్‌డీఓ మాట్లాడుతు ఐకేపీ సెంటర్‌లో మహిళలే నిర్వహించడం అభినందనీయమన్నారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటు న్నాయని, అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున కొనుగోళ్లు వేగ వంతం చేయించాలని సూచించారు. ఐకేపీ ఏపీఎం గీత మహిళ సమైఖ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:49 PM