పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
ABN, Publish Date - May 12 , 2025 | 11:48 PM
పాలీసెట్ 2025కు ఏర్పాటు పూర్తయినట్లు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె.లక్ష్మీనర్సయ్య పేర్కొన్నారు. జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాల్లో మంగళవారం పరీక్ష నిర్వహిస్తున్నామని, జిల్లాలోని 2488 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
పెద్దపల్లి రూరల్, మే 12 (ఆంధ్రజ్యోతి): పాలీసెట్ 2025కు ఏర్పాటు పూర్తయినట్లు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె.లక్ష్మీనర్సయ్య పేర్కొన్నారు. జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాల్లో మంగళవారం పరీక్ష నిర్వహిస్తున్నామని, జిల్లాలోని 2488 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో చీప్ సూపరింటెం డెంట్లకు, జిల్లా కోఆర్డినేటర్‌లకు పరీక్ష నిర్వహణకు సంబంధించిన వివ రాలను కో ఆర్డినేటర్ వెల్లడించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహిస్తామని, విద్యార్థులను గంట ముందు నుంచే పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లు, పెన్సిల్, పెన్‌తోసహా పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించమన్నారు.
Updated Date - May 12 , 2025 | 11:48 PM