భూసమస్యలపై దరఖాస్తులు సమర్పించాలి
ABN, Publish Date - May 06 , 2025 | 12:09 AM
భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు వినియోగించుకోవాలని, సమస్య లపై దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయ తీలో, బుర్హాన్‌మియాపేటలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులను కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమ వారం పరిశీలించారు.
ఎలిగేడు, మే 5 (ఆంధ్రజ్యోతి): భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు వినియోగించుకోవాలని, సమస్య లపై దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయ తీలో, బుర్హాన్‌మియాపేటలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులను కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమ వారం పరిశీలించారు. భూసమస్యలు ఉన్నవారు తమ దరఖాస్తులను రెవెన్యూ సదస్సులలో అందించాలని, భూభారతి చట్టం ప్రకారం పరి ష్కారానికి చర్యలు తీసుకుం టామని తెలిపారు. అనంతరం మండల కేంద్రంతో పాటు ధూళికట్ట, బుర్హాన్‌మియా పేటలో ధాన్యం కొనుగోలు కేం ద్రాలను కలెక్టర్ పరిశీలించారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవస రం లేదన్నారు.
శివపల్లిలో ఇం దిరమ్మ ఇండ్ల నిర్మాణ పను లను కలెక్టర్ పరిశీలించారు. ఇండ్లు త్వరగా గ్రౌండ్ చేసుకొని పనులు ప్రారంభిం చాలని, బేస్మెంట్ వరకు పూర్తిచేసుకున్న ఇళ్లకు లక్ష రూపాయలు విడుదల చేస్తుందని తెలిపారు. ధూళికట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఇన్‌చార్జి ఆర్డీవో సురేష్, తహసీల్దార్ బషీరుద్ధీన్, అడిషనల్ డీఆర్‌డీఓ రవికుమార్, ఎంపీడీఓ భాస్కర్‌రావు, డిప్యూ టీ తహసీల్దార్ కిరణ్‌కుమార్, పాల్గొన్నారు.
Updated Date - May 06 , 2025 | 12:09 AM