వన మహోత్సవానికి కార్యాచరణ రూపొందించాలి
ABN, Publish Date - Jun 25 , 2025 | 12:14 AM
వన మహోత్సవ కార్యక్రమం విజయవంతానికి వార్డు అధికారులు కార్యాచ రణ రూపొందించుకోవాలని కమిషనర్ అరుణశ్రీ సూచిం చారు. మంగళవారం కార్యాలయంలో వార్డు అధికారుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది కార్పొరేషన్ 4.8 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారన్నారు.
కోల్‌సిటీ, జూన్ 24(ఆంధ్రజ్యోతి): వన మహోత్సవ కార్యక్రమం విజయవంతానికి వార్డు అధికారులు కార్యాచ రణ రూపొందించుకోవాలని కమిషనర్ అరుణశ్రీ సూచిం చారు. మంగళవారం కార్యాలయంలో వార్డు అధికారుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది కార్పొరేషన్ 4.8 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారన్నారు. డివిజన్లలో మొక్కలు నాటడానికి అనువైన స్థలాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని, స్థలాలు, మొక్కల వివరాలు జాబితా ఇస్తే గుంతలు తీసేందుకు చర్యలు చేడుతా మన్నారు. ఆర్‌పీల సహకారంతో ఇంటింటా సర్వే నిర్వ హించి అవసరమైన పండ్ల, పూల జాతి మొక్కలను అంద జేస్తామ న్నారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిల్వ ఉన్న నీటిని పారబోయా లన్నారు.
కార్పొరేషన్ ద్వారా ఫాగిం గ్, స్ర్పే, ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యలు క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. ఇందిరమ్మ లబ్దిదా రులకు ఎంపీఏవై పథకం ప్రయోజనాలు అందేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. వార్డు ఆఫీసర్లకు బ్యాగులు, క్యాప్ వాటర్ బాటిళ్లు అందజేశారు. కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రామన్, డీఈలు షాబాజ్, హన్మంతనాయక్, ఆర్‌ఓ ఆంజనేయులు, ఏఈ తేజస్విని, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 12:14 AM