ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలందరిని ఏకం చేసే తిరంగా యాత్ర

ABN, Publish Date - May 17 , 2025 | 11:55 PM

దేశ రక్షణ కోసం ప్రతీ ఒక్కరు సైనికులం అవుతామని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరంగాయాత్ర ఉగ్రవాదుల దాడి అనంతరం దేశ ప్రజలందరూ ఒక్కటై సైనికుల వెంట నిలవడటం గర్వంగా ఉంద న్నారు.

పెద్దపల్లిటౌన్‌, మే 17 (ఆంధ్రజ్యోతి) దేశ రక్షణ కోసం ప్రతీ ఒక్కరు సైనికులం అవుతామని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరంగాయాత్ర ఉగ్రవాదుల దాడి అనంతరం దేశ ప్రజలందరూ ఒక్కటై సైనికుల వెంట నిలవడటం గర్వంగా ఉంద న్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ ప్రజల ప్రాణాలను తీయాలని చూస్తున్న పాకిస్థాన్‌కు మన సైనికులు తగిన గుణ పాఠం చెప్పారన్నారు. ఈ నెల 23న పెద్దపల్లి పట్టణంలో తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కులసంఘాలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాశిపేట లింగయ్య, వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాంసిగ్‌, పల్లె సదానందం, పర్శ సమ్మయ్య, శివంగారి సతీష్‌, పహీం, తదితరులున్నారు.

Updated Date - May 17 , 2025 | 11:55 PM