ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kalvakuntla Kavitha: ఇకపై కొత్త కార్యాలయం నుంచే జాగృతి కార్యకలాపాలు.. కవిత

ABN, Publish Date - May 31 , 2025 | 05:36 PM

Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లో ‘తెలంగాణ జాగృతి’ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

Kalvakuntla Kavitha

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లో ‘తెలంగాణ జాగృతి’ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ తెలంగాణ జాగృతి ప్రారంభించి 18 ఏళ్లయ్యింది. తెలంగాణ ప్రతి ఉద్యమంలోనూ జాగృతి భాగమైంది. కేసీఆర్, ప్రొ.జయశంకర్ స్ఫూర్తితో జాగృతి ఏర్పాటైంది. ప్రొ.జయశంకర్ చెప్పిన తర్వాతే తెలంగాణ జాగృతి స్థాపించాం. ప్రొ.జయశంకర్ నాకు దిశానిర్దేశం చేశారు. ఇకపై కొత్త కార్యాలయం నుంచే జాగృతి కార్యకలాపాలు జరుగుతాయి’ అని అన్నారు.


రేవంత్ ఇప్పటికైనా జై తెలంగాణ అనండి

‘ప్రస్తుత సీఎం కనీసం జై తెలంగాణ కూడా అనరు. రేవంత్ ఇప్పటికైనా జై తెలంగాణ అని నినదించాలి. తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు అమరవీరులకు నివాళులర్పించాలి. నివాళులర్పించని వారికి కుర్చీలో కూర్చునే అర్హత లేదు. ఉద్యమకారులపైకి గన్ తీసుకెళ్లిన వాళ్లు.. ప్రస్తుతం రాష్ట్రానికి సీఎం అయ్యారు. తెలంగాణ పథకాలకు తెలంగాణ వారి పేర్లే పెట్టాలి. తెలంగాణ యువ వికాసం అని ఉండాలి.. రాజీవ్ యువవికాసం అని కాదు. వేరే రాష్ట్రం తెలంగాణ నీళ్లు తీసుకెళ్తుంటే మాట్లాడలేని పరిస్థితి రేవంత్‌ది. బనకచర్ల ప్రాజెక్ట్‌పై రేవంత్ ఎందుకు మాట్లాడటం లేదు. గోదావరి నీళ్లు శాశ్వతంగా దూరం కాబోతున్నాయి. ఏపీ ప్రయోజనాల కోసమే రేవంత్ పనిచేస్తున్నారు’


కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోం

‘ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌కు నోటిసులిస్తారా. కేసీఆర్‌కు నోటీసులివ్వడమంటే తెలంగాణకు ఇచ్చినట్టే. తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసినందుకు.. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారా. అసలు అది కాళేశ్వరం కమిషనా.. కాంగ్రెస్ కమిషనా. కేసీఆర్ పిడికిలి బిగిస్తేనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. జూన్ 4న ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా చేపడుతున్నాం. కేసీఆర్‌కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే.. మరో కన్ను తెలంగాణ జాగృతి. కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోం. గోదావరి జలాల్లో వాటా కాపాడకపోతే.. తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

జగన్ ప్రభుత్వంలో రేషన్ సరుకుల అక్రమాలపై విచారణ చేశాం

ఆపరేషన్ సిందూర్‌పై కామెంట్లు.. లా స్టూడెంట్ అరెస్ట్..

Updated Date - May 31 , 2025 | 06:07 PM