ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CPI: కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు..!

ABN, Publish Date - Jun 15 , 2025 | 04:10 AM

కాళేశ్వరం ప్రాజెక్టు ఇకముందు ఎంతమాత్రమూ పనికిరాదని, ప్రజలపై భారం మోపే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

  • ప్రజలపై భారం మోపే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలి

  • ప్రాజెక్టుకు ఏటా వేల కోట్ల ఖర్చు వద్దు

  • కాళేశ్వరానికి అన్నీ నేనేనన్న కేసీఆర్‌ ఇప్పుడు సంబంధం లేదంటున్నారు

  • కగార్‌ పేరుతో కమ్యూనిస్టులను లేకుండా చేయాలని మోదీ కలలు

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

న్యూశాయంపేట, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు ఇకముందు ఎంతమాత్రమూ పనికిరాదని, ప్రజలపై భారం మోపే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలో శనివారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిష్ఫలంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ కోసం ఏటా రూ.వేల కోట్ల ప్రజల సొమ్మును ఖర్చు చేయొద్దన్నారు. ‘కాళేశ్వరం అంటే కేసీఆర్‌.. కేసీఆర్‌ అంటే కాళ్వేరం..’ అని అన్నోళ్లు ప్రస్తుతం నోరు మూసుకున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘నా మెదడును కరిగించి డిజైన్‌ చేశాను.. కాళేశ్వరానికి అన్నీ నేనే..’ అన్న కేసీఆర్‌.. ఇప్పుడు తనకు సంబంధం లేదంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యత ఇంజనీర్‌లదేనని ఇప్పుడు తప్పించుకోవడం అన్యాయమని కూనంనేని అన్నారు.

ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సి ఉండగా, మహారాష్ట్ర అనుమతివ్వకపోవడంతో కాళేశ్వరానికి మార్చామని హరీశ్‌రావు అంటున్నారని, అలాగని జనాలను ముంచే ప్రాజెక్టు కడతారా? అని ప్రశ్నించారు. 140 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని తాము డిమాండ్‌ చేశామని, అక్కడ నిర్మిస్తే అన్ని జిల్లాలకు సాగునీరు అందేదని తెలిపారు. కాళేశ్వరం నిర్మించాక ఒక్క చుక్క నీరు అదనంగా ఇవ్వలేదని, ఇప్పుడు పంటలకు వచ్చేది ఎల్లంపల్లి నీళ్లేనన్నారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కమ్యూనిస్టులను లేకుండా చేయాలని మోదీ ప్రభుత్వం కలలు కంటోందని కూనంనేని అన్నారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. 2026 మార్చినాటికి మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పడం ఒక ఫ్యూడల్‌, గూండా, ఫాసిస్టు పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఒక్క నంబాల కేశవరావును చంపితే దేశంలో కోట్లాది మంది స్పందించారని, అదీ కమ్యూనిస్టులకు ఉన్న మానవతావాదానికి నిదర్శనమని పేర్కొన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 04:10 AM