Indiramma Housing: పదిలంగా అల్లుకున్న ఇందిరమ్మ ఇల్లు మాదీ
ABN, Publish Date - Aug 01 , 2025 | 04:25 AM
సొంతిల్లు ఓ భరోసా! మనదంటూ ఓ గూడు ఉంటే ఆ నీడన కారం, రొట్టె తిన్నా కూడా తృప్తిగా ఉంటుందని.. రంధి అ
హనుమకొండ భీమదేవరపల్లిలో గృహప్రవేశం చేసిన దంపతులు
440 చదరపు అడుగుల్లో నిర్మాణం
‘ఇందిరమ్మ’లో పూర్తయిన రెండో ఇల్లు
సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ ఫొటోతో ఇంటిగడప కార్యక్రమం
భీమదేవరపల్లి, కోనరావుపేట (ఆంధ్రజ్యోతి): సొంతిల్లు ఓ భరోసా! మనదంటూ ఓ గూడు ఉంటే ఆ నీడన కారం, రొట్టె తిన్నా కూడా తృప్తిగా ఉంటుందని.. రంధి అనేదే ఉండదని గట్టి నమ్మకం! హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైన శ్రుతి-జలంధర్ రెడ్డి దంపతుల్లో ఇప్పుడిదే సంబురం. జలంధర్ చిన్న గుమాస్తా ఉద్యోగం చేస్తున్నారు. ఈ దంపతులకు బాబు, పాప ఉన్నారు. గత మార్చి 6న వీరికి రేవంత్ సర్కారు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. బేస్‌మెంట్ నుంచి స్లాబ్ పోసే దాకా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకున్నారు. 440 చదరపు అడుగుల్లో చక్కగా వంటగది, అటాచ్డ్ బాత్‌రూంతో పడకగది, హాల్‌తో ఇంటిని పొందికగా కట్టుకున్నారు. ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్‌మెంట్ అయ్యాక రూ. లక్ష, గోడలు నిర్మించాక రూ.లక్ష, స్లాబ్ పూర్తయ్యాక రూ.2 లక్షలు.. ఇలా ఇప్పటిదాకా రూ.4 లక్షల బిల్లులు వచ్చాయని జలంధర్ దంపతులు చెప్పారు. మరో రూ.లక్ష రావాల్సి ఉందన్నారు. బుధవారం బంధువుల సమక్షంలో నూతన గృహ ప్రవేశం చేశారు. నెలక్రితం పరిగి నియోజకవర్గం శివారెడ్డిపల్లిలో కూడా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం జరిగింది. తాజాగా భీమదేవరపల్లిలో జరిగిన గృహప్రవేశం రెండోది!
సీఎంపై అభిమానాన్ని చాటుకునేందుకు..
సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులైన దంపతులు నరహరి-లావణ్య బుఽధవారం ఇంటిగడప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివా్‌సలపై అభిమానంతో వారి చిత్రపటాలతో గడప పూజా కార్యక్రమాన్ని జరుపుకొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం కారణంగా తమ సొంతింటి కల నెరవేరుతోందని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News
Updated Date - Aug 01 , 2025 | 04:27 AM