జూన్ 10 నుంచి అగ్నివీర్వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీ
ABN, Publish Date - Apr 19 , 2025 | 04:28 AM
భారత వాయుసేనలో అగ్నివీర్వాయు(మ్యూజిషియన్)ల కోసం రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. జూన్ 10 నుంచి 18వ తేదీ వరకు న్యూఢిల్లీ, బెంగళూరులలో ఈ ర్యాలీ నిర్వహిస్తారు.
అల్వాల్, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): భారత వాయుసేనలో అగ్నివీర్వాయు(మ్యూజిషియన్)ల కోసం రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. జూన్ 10 నుంచి 18వ తేదీ వరకు న్యూఢిల్లీ, బెంగళూరులలో ఈ ర్యాలీ నిర్వహిస్తారు. ఏదైనా ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాల లేదా బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి లేదా సమాన విద్యార్హత పొందిన పెళ్లి కాని యువతీయువకులు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు 2005 జనవరి 1 నుంచి 2008 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
రిజిస్టర్ చేసుకున్న వారికే ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈనెల 21వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మే 11వ తేదీ రాత్రి 11 గంటలకు వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం defenderrollers@gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
Updated Date - Apr 19 , 2025 | 04:28 AM