Sangareddy: ‘డేటా స్పీడ్’లో ఐఐటీహెచ్ ముందడుగు
ABN, Publish Date - Jun 27 , 2025 | 03:32 AM
మారుమూల ప్రాంతాల్లో కూడా 5జీ సిగ్నళ్లను బలోపేతం చేసే.. మొబైల్ అప్లికేషన్ల డేటా స్పీడ్ పెంచే పరిజ్ఞానం అభివృద్ధిలో ఐఐటీహెచ్ ముందడుగు వేసింది.
మారుమూల ప్రాంతాల్లో 5జీ సిగ్నళ్ల బలోపేతానికి అభివృద్ధి చేసిన ఫీచర్‌కు ప్రేగ్ సదస్సు మద్దతు
6జీ అభివృద్ధికి దోహదపడుతుందని ప్రశంస
పరిశోధనల్లో వైసింగ్ నెట్‌వర్క్స్ సంస్థ సహకారం
కంది, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మారుమూల ప్రాంతాల్లో కూడా 5జీ సిగ్నళ్లను బలోపేతం చేసే.. మొబైల్ అప్లికేషన్ల డేటా స్పీడ్ పెంచే పరిజ్ఞానం అభివృద్ధిలో ఐఐటీహెచ్ ముందడుగు వేసింది. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీహెచ్... వైసింగ్ నెట్‌వర్క్స్ సంస్థ సహకారంతో హెచ్‌డీ వీడియో, ఎక్స్‌ఆర్, ఆన్-డివై్‌స ఏఐ వంటి క్లిష్టమైన అప్లికేషన్ల డేటాను వేగంగా అప్‌లోడ్ చేయడానికి ‘3జీపీపీ 5జీ ఆర్‌ఈఎల్-17’ అనే ఫీచర్‌ను తెచ్చింది.
దీనికి గురువారం యూర్‌పలోని ప్రేగ్‌లో నిర్వహించిన 3జీపీపీ అంతర్జాతీయ సదస్సు మద్దతు తెలిపింది. సాంకేతికత విషయంలో ఐఐటీహెచ్ ప్రపంచదేశాలతో పోటీపడుతోందని, ఆ సంస్థ పరిశోధనలు 6జీ టెక్నాలజీ అభివృద్ధికి పునాది వేస్తున్నాయని పలు ప్రఖ్యాత నెట్‌వర్క్ సంస్థ్థలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ పరిశోధనలకు ఐఐటీహెచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ కిరణ్ కుచి నేతృత్వం వహించారు.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News
Updated Date - Jun 27 , 2025 | 03:33 AM