ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Crime News: యువతితో డేటింగ్.. అనంతరం ఏం జరిగిందంటే..

ABN, Publish Date - May 27 , 2025 | 10:32 AM

Crime News:పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమీర్‌ పేట్‌కు చెందిన యువతి బెంగుళూరులో ఓ కామన్‌ ఫ్రెండ్స్‌ మీటింగ్‌‌లో శశాంక్‌ వేలూరిని కలిసింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి డేటింగ్ కూడా చేశారు.

Crime News

హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి (Marriage Promise) మోసం (Youth Cheats Woman) చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ (Police Arrest) చేశారు. వివరాల్లోకి వెళితే.. అమీర్‌‌పేట్‌కు చెందిన యువతి బెంగుళూరులోని ఓ కామన్‌ ఫ్రెండ్స్‌ మీటింగ్‌‌లో శశాంక్‌ వేలూరితో పరిచయం అయింది. తొలిచూపులోనే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్‌ చేశాడు. దీంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి డేటింగ్ కూడా చేశారు. ఉన్నత చదువుల కోసం యూకే వెళుతున్నానని, కొన్నాళ్ల తర్వాత వచ్చి పెళ్లి చేసుకుని నిన్ను కూడా యూకే తీసుకువెళతానని యువతికి చెప్పి శశాంక్ యూకే వెళ్లిపోయాడు.


యూకే వెళ్ళిన తర్వాత శశాంక్ యువతి సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసి.. ఆమెను దూరం పెట్టాడు. యువతి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో 2023 డిసెంబర్‌లో ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శశాంక్‌పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో శశాంక్ యూకే నుంచి తిరిగి వస్తున్నట్లు ఇమిగ్రేషన్‌ అధికారులు సమాచారం అందించడంతో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ వద్ద అరెస్టు చేసి రిమాండ్‌‌కు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: మరో కీలక సూత్రధారి కోసం పోలీసుల వేట..


మావోయిస్టు లేఖ కలకలం..

మరోవైపు షాపూర్‌నగర్‌లో.. మావోయిస్టు పేరుతో వచ్చిన బెదిరింపు లేఖ కలకలం రేపింది. షాపూర్ నగర్‌కు చెందిన కూన రవీందర్ గౌడ్ కుమారుడు రాఘవేందర్ గౌడ్ (కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుని కుమారుడు)ను చంపుతామని లేఖలో పేర్కొన్నారు. ఇంటి ముందు ఉన్న తులసి మొక్కను ధ్వంసం చేసి.. ఎరుపు రంగు టవల్‌లో.. కారుపై కాగితాన్ని ఉంచారు. ఆ లేఖలో ఏముందంటే.. ‘రూ. 50 లక్షలు ఇవ్వకపోతే.. తులసి మొక్కను ధ్వంసం చేసిన మాదిరిగానే.. నీ కొడుకును చంపుతానంటూ’ లేఖలో ఉంది. ఈ ఘటన ఈ నెల 21న జరిగింది. దీంతో రాఘవేందర్ గౌడ్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వ్యక్తి మాస్కు ధరించి వచ్చినట్లు గుర్తించారు. కాగా ఈ కేసును పోలీసులు గోప్యంగా ఉంచి విచారణ జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అదే నా ఆశ… ఆకాంక్ష..సీఎం చంద్రబాబు

తొలి రోజు 23 వేల మంది ప్రతినిధులతో మహానాడు

For More AP News and Telugu News

Updated Date - May 27 , 2025 | 10:33 AM