ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Justice PC Ghose Report: కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..

ABN, Publish Date - Aug 03 , 2025 | 05:55 PM

తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ ఘోష్ అందించిన నివేదికపై చర్చ జరిగింది.

TG CS RamaKrishna Rao

హైదరాబాద్, ఆగస్ట్ 03: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ అందించిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన ఆదివారం నాడు సచివాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ హాజరైంది. తెలంగాణ కేబినెట్‌కు అందించాల్సిన కాళేశ్వరం నివేదికపై ఈ కమిటీ చర్చించారు. సోమవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని సచివాలయంలో కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కాళేశ్వరంపై కమిటీ అందించే నివేదికపై చర్చించనున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను నిర్మించారు. అయితే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగాయి. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అనంతరం ఈ ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

దాదాపు 15 నెలలపాటు ఈ కమిషన్ విచారణ జరిపింది. చివరకు జులై 31వ తేదీన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. తన నివేదికను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. ఆగస్టు 1వ తేదీన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ నివేదికపై ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఈ కమిటీ ఈరోజు సమావేశమైంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సోమవారం కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

తొలి రోజు జైలులో ప్రజ్వల్ రేవణ్ణ..

ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 06:30 PM