Share News

Prajwal Revanna: తొలి రోజు జైలులో ప్రజ్వల్ రేవణ్ణ..

ABN , Publish Date - Aug 03 , 2025 | 03:47 PM

పలువురి మహిళలపై లైంగిక దాడి కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు శాశ్వత జీవిత ఖైదు విధించింది. దీంతో శనివారం అతడిని బెంగళూరులోని పరప్పన్ అగ్రహారం జైలుకు తరలించారు. అతడికి ఖైదీ నెంబర్ కేటాయించారు.

Prajwal Revanna: తొలి రోజు జైలులో ప్రజ్వల్ రేవణ్ణ..
Prajwal Revanna

బెంగళూరు, ఆగస్ట్ 03: పలువురు మహిళలపై లైంగిక దాడి కేసులో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రజాప్రతినిధుల కోర్టు శాశ్వత జైలు శిక్ష విధించిన నేపథ్యంలో అతడిని బెంగళూరులోని పరప్పన్ అగ్రహార సెంట్రల్ జైలుకు శనివారం పోలీసులు తరలించారు. అనంతరం అతడికి ఖైదీ నెంబర్ 15528ను కేటాయించారు. అయితే అతడు గత రాత్రి.. అంటే శనివారం రాత్రి చాలా విచారంతోపాటు కొంత ఒత్తిడితో కనిపించారని జైలు అధికారులు ఆదివారం తెలిపారు. ఇక శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ప్రజ్వల్ ఆరోగ్యాన్ని వైద్యులు పరీక్షించారని చెప్పారు. అతడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారన్నారు. వైద్యుల పరీక్షిస్తున్న సమయంలో సైతం అతడు ధీనంగా ఉన్నడని.. అలాగే తన బాధను వారికి వ్యక్తం చేశాడని చెప్పారు.


మరోవైపు ప్రజా ప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పుపై తాను హైకోర్టుకు వెళ్తానని సిబ్బందికి తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు అతడిని భారీ భద్రత ఉన్న సెల్‌లో ఉంచామన్నారు. అలాగే అతడిని ఉంచి సెల్‌కు అసాధారణ రీతిలో భద్రత కల్పించామని చెప్పారు. సాధారణ ఖైదీలకు వలే డ్రస్ కోడ్ ఆయనకు ఉందని తెలిపారు. ఆ డ్రస్‌ను ప్రజ్వల్‌కు అందజేస్తామని స్పష్టం చేశారు.


2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలుకు కొద్ది రోజుల ముందు హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన కొన్ని అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. అదే సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ తమపై లైంగిక దాడి జరిపినట్లు పలువురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను నియమించింది. దీనిపై సిట్ విచారణ జరిపి.. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేల్చి చెప్పింది. దీంతో బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల కోర్టు అతడికి శాశ్వత జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా.. రూ. 11.50 లక్షల జరిమానా విధించింది.

ఇవి కూడా చదవండి..

కుల్గాంలో హోరాహోరా ఎన్‌కౌంటర్

వరదల తాకిడికి వారణాసి-ప్రయాగ్‌రాజ్ అతలాకుతలం.. అఖిలేష్ యాదవ్ ఆగ్రహం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 03:49 PM