Rain Alert: తెలంగాణలో వర్షాలే వర్షాలు
ABN, Publish Date - May 03 , 2025 | 04:30 PM
Rain Alert: తెలంగాణలో వర్షాలపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. రాష్ట్రంలో వర్షాలు దచ్చికొట్టనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్, మే 3: తెలంగాణలో (Telangana) వాతావరణం ఒక్కోసారి ఒక్కోలా మారిపోతుంది. అప్పటి వరకు వేడి గాలులు, ఎండవేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు సాయంత్రం కాగానే చల్లటి వాతావరణం ఉపశమనాన్ని ఇస్తోంది. అంతేకాకుండా ఉన్నట్టుండి వర్షాలు కూడా పడుతున్నాయి. ఉదయం ఎండగా ఉంటూ.. సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రజలకు ఊరట కలిగిస్తోంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్టేడ్ ఇచ్చింది. రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నట్లు పేర్కొంది. ఏయే జిల్లాలో వర్షాలు పడనున్నాయో వెల్లడించింది.
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపటి నుంచి మూడు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం పూట ఎండలు దంచికొట్టినప్పటికీ సాయంత్రం వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. ఈదురుగాలులతో కూడిన వర్షం పడనున్నట్లు వెదర్ రిపోర్ట్ చెబుతోంది. రాష్ట్రంలో ఏయే జిల్లాలో వర్షాలు పడతాయనే విషయాన్ని కూడా వాతావరణ వాఖ ప్రకటించింది.
Janu Lyri: రెండో పెళ్లి కన్ఫార్మ్ చేసిన జాను లిరి.. అతడి ఫొటో షేర్ చేసి మరీ..
ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్ నల్లగొండ, వరంగల్, జనగాం, సూర్యాపేట, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తమంగా ఉండగాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలకు రైతులు అల్లాడిపోతున్నారు. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురవగా.. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి రాకముందే వర్షానికి దెబ్బతినడంతో రైతులు బాధ వర్ణణాతీతమనే చెప్పుకోవాలి. ఈదురుగాలలు, ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వర్షంతో పంటలకు అపారనష్టం వాటిల్లింది.
ఇవి కూడా చదవండి
Robbery: ఇళ్లు అద్దెకు కావాలంటూ వచ్చి..ఏం చేశారంటే
Pakistan Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు..తొమ్మిదోసారి ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 03 , 2025 | 05:38 PM