ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gaddar Film Awards: 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలు ఇవే ..

ABN, Publish Date - May 30 , 2025 | 11:44 AM

నందమూరి బాలకృష్ణను ఎన్టీఆర్ అవార్డ్‌కు, మణిరత్నంకు పైడి జయరాజ్ అవార్డు, దర్శకుడు సుకుమార్‌కు బిఎన్ రెడ్డి అవార్డ్‌, అట్లూరి పూర్ణ చంద్రరావుకు నాగిరెడ్డి చక్రపాణి అవార్డ్, విజయదేవరకొండకు కాంతారావ్ అవార్డ్, యండమూరి వీరేంద్రనాథ్‌కు రఘపతి వెంకయ్య అవార్డ్‌కు ఎంపిక చేసినట్లు మురళీ మోహన్ ప్రకటించారు.

హైదరాబాద్, మే 30: సినిమా అవార్డులను ఏకాభిప్రాయంతోనే ఎంపిక చేశామని ఫిలిం జ్యూరీ చైర్మన్ ఎం. మురళీ మోహన్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల అవార్డులను ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిన తరువాత సినిమా అవార్డులు ఆపేశారన్నారు. సినిమాలకు ప్రభుత్వం అవార్డులు గుర్తింపు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకుని గద్దర్ అవార్డులను ప్రారంభించారని తెలిపారు. ఆ క్రమంలో తనను జ్యూరీ చైర్మన్‌గా ఎంపిక చేశారని చెప్పారు.

ఈ సందర్భంగా దిల్ రాజు, ఎండీ హరీష్‌తోపాటు జ్యూరీ మెంబర్స్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2014 నుంచి 23 వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించిన వరుసగా మొదటి, రెండు, మూడు ఉత్తమ చిత్రాలను సంవత్సరాల వారీగా ఆయన ప్రకటించారు. నందమూరి బాలకృష్ణను ఎన్టీఆర్ అవార్డ్‌కు, మణిరత్నంకు పైడి జయరాజ్ అవార్డు, దర్శకుడు సుకుమార్‌కు బిఎన్ రెడ్డి అవార్డ్‌, అట్లూరి పూర్ణ చంద్రరావుకు నాగిరెడ్డి చక్రపాణి అవార్డ్, విజయ దేవరకొండకు కాంతారావు అవార్డ్, యండమూరి వీరేంద్రనాథ్‌కు రఘపతి వెంకయ్య అవార్డ్‌కు ఎంపిక చేసినట్లు ఎం మురళీ మోహన్ ప్రకటించారు.


  • 2014: రన్ రాజా రన్ , పాఠశాల, అల్లుడు శీను

  • 2015: రుద్రమ్మ దేవి, కంచె, శ్రీమంతుడు

  • 2016: శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్

  • 2017 : బాహుబలి 2 , ఫిదా , ఘాజీ

  • 2018 : మహానటి, రంగస్థలం , కేరాఫ్ కంచరపాలెం

  • 2019: మహర్షి, జెర్సీ, మల్లేశం

  • 2020: అల వైకుంఠపురంలో , కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలడీస్

  • 2021: ఆర్ఆర్ఆర్, అఖండ, ఉప్పెన

  • 2022: సీతారామం, కార్తీకేయ 2 , మేజర్

  • 2023: బలగం, హనుమాన్, భగవంత్ కేసరి


అయితే 2024 ఏడాదికి సంబంధించిన ఉత్తమ చిత్రాల అవార్డులను గురువారం జ్యూరీ కమిటీ చైర్మన్, సహాజ నటి జయసుధ హైదరాబాద్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వం ఉత్తమ చిత్రాల ఎంపికను చేపట్టలేదు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరన తర్వాత.. గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇస్తామని ప్రకటించారు. ఆ క్రమంలో 2024 ఏడాది ఉత్తమ చిత్రాల ఎంపిక కమిటీ చైర్మన్‌గా జయసుధను నియమించారు. అాలాగే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి గతేడాది వరకు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేేేసేందుకు కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి ప్రముఖ నటుడు మాగంటి మురళీ మోహన్‌ను ప్రభుత్వం నియమించింది.

ఇవి కూడా చదవండి

బాత్‌రూమ్‌లో నీళ్లు లేవు.. మండిపడ్డ నటి

సిట్ కస్టడీకి లిక్కర్ స్కామ్ నిందితులు..

For Telangana News And Telugu News

Updated Date - May 30 , 2025 | 12:06 PM