Congress: సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ కీలక భేటీ
ABN, Publish Date - Jun 06 , 2025 | 12:53 PM
Congress: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆమె భేటీ అయ్యారు. గత పది రోజులుగా పార్టీ నేతలతో మీనాక్షి వరుస సమావేశాలు నిర్వహించారు. వారు చెప్పిన సమస్యలు, అభిప్రాయాలను ముఖ్యమంత్రికి వివరించారు.
Hyderabad: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జి (Congress In Charge) మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) భేటీ (Meeting)అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో వారు సమావేశమయ్యారు. గత పది రోజులుగా పార్టీ నేతలతో మీనాక్షి వరుస సమీక్షలు నిర్వహించారు. పార్టీ నేతల అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ చర్చించారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి.. అలాగే అసెంబ్లీకి సంబంధించి నేతలతో ఉమ్మడి జిల్లాలకు కొంతమంది అబ్జర్వర్స్‌ను నియమించారు. వారందరితో వరుసగా పది రోజులపాటు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ విషయాలన్నీ రేవంత్ రెడ్డికి మీనాక్షి వివరించారు.
సమస్యలు చెక్ పెట్టే దిశగా చర్యాలు..
ఇంకా మీనాక్షి నటరాజన్ సమీక్షల్లో చాలా మంది నేతలు జిల్లాలు, నియోజకవర్గాల్లో ఒక నేతపై మరొక నేత ఫిర్యాదులు చేసుకున్నారు. దాంతో పాటు ఆధిపత్యపోరుకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లాలు, నియోజకవర్గాల్లో నేతలు సోషల్ మీడియాలో చాలా వీక్‌గా ఉన్నారని, చాలా మందికి సోషల్ మీడియాపై అవగాహన లేదని, ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి వివరాలు తెలియవని, వాటిపై వారికి అవగాహన లేకపోవవడంతో జనాలకు వివరించలేకపోతున్నారని మీనాక్షికి ఫిర్యాదులు అందాయి. అన్ని విషయాలను ఆమె సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ సమస్యలన్నింటికి పరిష్కార మార్గాలు చూపవలసిందిగా ఆమె సీఎంను కోరారు. అలాగే కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతల వల్ల పాత నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని దీనికి చెక్ పెట్టాలని మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు. వీటన్నింటికి సంబంధించిన విషయాలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..
కాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించనుంది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని.. అందుకే రెండు మూడు నెలలకోసారి కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా కేబినేట్లో సమీక్ష చేయాలని నిర్ణయించారు. మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు వీలుగా రెండు వారాలకోసారి మంత్రి వర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి నెలలో మొదటి, మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నారు. కాగా ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 17 సార్లు కేబినేట్ భేటీలు జరిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఘనంగా అఖిల్, జైనాబ్‌ల వివాహం..
కాళేశ్వరంపై విచారణ తిరిగి ప్రారంభం
For More AP News and Telugu News
Updated Date - Jun 06 , 2025 | 05:41 PM