ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Movie Piracy in Tollywood: టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్

ABN, Publish Date - Jul 03 , 2025 | 04:28 PM

పైరసీ దెబ్బకు టాలీవుడ్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. అలాంటి వేళ.. పైరసీ చేసి టాలీవుడ్‌కు వేల కోట్ల రూపాయిలు నష్టం తెచ్చిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి భారీ ఎత్తున పైరసీ చేసిన మూవీ ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు.

Piracy Mastermind kiran kumar Arrested

హైదరాబాద్, జులై 03: టాలీవుడ్‌లో విడుదలైన పలు భారీ చిత్రాలను పైరసీ చేసి.. వాటి ద్వారా భారీగా నగదు దండుకుంటున్న కిరణ్ కుమార్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి భారీగా పైరసీ సినిమా ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కిరణ్ కుమార్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. టాలీవుడ్‌లో దాదాపు 40 పెద్ద సినిమాలను అతడు పైరసీ చేసినట్లు గుర్తించారు. ఈ సినిమాలను హెచ్‌డీ ప్రింట్ రూపంలో పైరసీ చేసి విక్రయించినట్లు కనుగొన్నారు.

ఈ భారీ చిత్రాలను పైరసీ చేయడం వల్ల టాలీవుడ్ పరిశ్రమకు రూ. 3,700 కోట్లు నష్టం వాటిల్లిందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. మరోవైపు కామ్ కార్డ్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసుల ఎదుట కిరణ్ కుమార్ ఒప్పుకున్నాడు. సినిమా థియేటర్లలోనే పైరసీ చేసి వాటిని అతడు మాఫియాకి విక్రయించేవాడు. వన్ తమిళ్ ఎమ్‌వీ సంస్థకు ఈ పైరసీ సినిమాలను అతడు విక్రయించాడు. ఇలా ఒక్కొక్క సినిమాకి అతడు 400 క్రిప్టో కరెన్సీని తీసుకున్నాడు.

క్రిప్టోతోపాటు బిట్ కాయిన్స్ రూపంలో వారి నుంచి కిరణ్ కుమార్ నగదు వసూల్ చేశారు. బిట్ కాయన్స్, క్రిప్టో రూపంలో వచ్చిన నగదును జూ పే ద్వారా ఇండియన్ కరెన్సీకి అతడు మార్చుకున్నట్లు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాద్, గేమ్ చేంజర్, రాజధాని సినిమాలకు చెందిన ఫైల్స్‌ను కిరణ్ కుమార్‌ నుంచి సైబర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ థియేటర్లలోనే కామ్ కార్డు ద్వారా కిరణ్ ఈ సినిమాలు రికార్డింగ్ చేసినట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. ఏడాదిన్నర కాలంలో దాదాపు 40 పెద్దపెద్ద సినిమాలను పైరసీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. వాటిల్లో తెలుగు, తమిళ సినిమాలు ఉన్నాయి. ఇప్పటివరకూ 65 సినిమాలను రికార్డు చేసినట్లు కిరణ్ కుమార్ పేర్కొన్నారు. వన్ తమిళ్‌బ్లాస్టర్, వన్ తమిళ్‌ఎమ్‌వీ, 5 మూవీరూల్జ్‌, వెబ్ సైట్లకు ఈ పైరసీ సినిమాలను విక్రయించినట్లు తెలుస్తోంది.

పైరసీ చేసిన చిత్రాలు..

తండేల్, సింగిల్, కిస్మత్ (హిందీ), రోమాంటిక్, గేమ్ ఆన్, పెళ్లి కానీ ప్రసాద్, రాజధాని ఫైల్స్, ప్రతిరోజు పండుగే చిత్రాలు అతడు పైరసీ చేసిన జాబితాలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

వరంగల్ ఇష్యూ.. మీనాక్షికి నివేదిక ఇచ్చిన కొండా దంపతులు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 03 , 2025 | 05:08 PM