ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

S Rammohan Reddy: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఫ్రాడ్‌పై నివేదిక కోరిన కాగ్

ABN, Publish Date - Jun 03 , 2025 | 06:51 PM

బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పీసీసీ అధికార ప్రతినిధి ఎస్ రామ్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆర్ ఎస్ ప్రవీణ్ అవినీతిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కాగ్ కోరిందన్నారు.

TG PCC Spokesperson S Rammohan Reddy

గాంధీ భవన్, జూన్ 03: తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దళిత పిల్లల పేర్ల మీద వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లూఠీ చేశారని ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు చెప్పి...ఆయన రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో కేంద్రం పొందు పరిచిన అంశాలనే తాము బయట పెడుతున్నామన్నారు. కోడింగ్ విధానంపై ఏడాదికి రూ. 4 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. 240 మంది పిల్లలకు కోడింగ్ చేస్తే రూ. 4 కోట్లు అవుతాయా..? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. మూడు సంస్థల పేరుతో కోడింగ్ నేర్పిస్తానంటూ రెండు సంస్థల నుంచే అనుమతి తీసుకున్నారని గుర్తు చేశారు. అంతేకాదు.. ఈ - టెండర్ ప్రక్రియ సైతం చేయ లేదని చెప్పారు.


అంబేద్కర్ పేరు చెప్పి...దళిత విద్యార్థుల పేరుతో లూటీ చేశారంటూ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌పై సామా రామ్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. దీనికి ఆర్ధిక శాఖ అనుమతి కూడా లేదన్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఐఐటీ.. జేఈఈ ఆన్‌లైన్‌ కోర్స్‌కి రూ.20 కోట్లు ఖర్చు పెట్టారని.. దీనికి టెండర్ లేదు.. ఆర్ధిక శాఖ అనుమతి సైతం లేదని వివరించారు.


ఇప్పుడు కూడా లక్ష 20 వేల మందికి కోడింగ్‌కి తమ ప్రభుత్వం శిక్షణ ఇస్తుందని చెప్పారు. అదీ కూడా తమ ప్రభుత్వం నేర్పిస్తుందని చెప్పారు. ఆర్ ఎస్ ప్రవీణ్ ఫ్రాడ్‌పై ప్రభుతాన్ని కాగ్ నివేదిక కోరిందన్నారు. అదే విధంగా సమ్మర్ క్యాంప్‌ల పేరు మీద కూడా నిధులు పక్కదారి పట్టించారని పేర్కొన్నారు. 11 ఏళ్లలో ఎస్సీ గురుకులాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ లేదన్నారు. కానీ ప్రస్తుతం సీట్లు అన్నీ భర్తీ అయ్యాయని చెప్పారు. చివరకు యూనిఫాం..దుప్పట్లు కూడా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వదిలి పెట్ట లేదని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్ జగన్ పరామర్శలో ట్విస్ట్

ఈ వైన్ తాగడం వల్ల ఇన్ని లాభాలా..?

For Telangana News And Telugu news

Updated Date - Jun 03 , 2025 | 06:51 PM