Miss World 2025: చార్మినార్ వద్ద సుందరీమణులు హెరిటేజ్ వాక్
ABN, Publish Date - May 13 , 2025 | 07:23 AM
Miss World 2025: మిస్ వరల్డ్-2025 పోటీదారులు మంగళవారం హైదరాబాద్ నగరంలోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చార్మినార్ పరిధిలో మిస్ వరల్డ్-2025 హెరిటేజ్ వాక్, చౌమల్లా ప్యాలెస్‌లో వెల్‌కమ్ డిన్నర్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
హైదరాబాద్: మిస్ వరల్డ్-2025 (Miss World 2025) పోటీదారులు (Contestants) మంగళవారం హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ (Charminar) వద్ద హెరిటేజ్ వాకింగ్ (Heritage Walk) నిర్వహిస్తారు. దాదాపు నాలుగు ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు చేరుకునే 109 దేశాల సుందరీమణులకు పాత బస్తీలో పాపులర్ అయిన మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు. చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటో షూట్ నిర్వహిస్తారు. అనంతరం చార్మినార్ సమీపంలోని చుడీ బజారులో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల షాపింగ్ చేస్తారు.
అలాగే హైదరాబాద్ బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్, కన్హయ్యలాల్, మోతిలాల్ కర్వా, గోకుల్ దాస్ జరీవాల, కెఆర్ కాసత్, జాజు పెరల్స్ ఏహెచ్ జరీవాల, అఫ్జల్ మియా కర్చోబే వాలే దుకాణాల్లో షాపింగ్ చేస్తారు. గాజులు తయారు చేసే విధానాన్ని స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం సుప్రసిద్ధ చౌహన్లా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసే విందుకు హాజరవుతారు. కాగా మిస్ వరల్డ్ కాంటేస్టర్లకు మెహంది వేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా నిజామి సాంప్రదాయ దుస్తులను కూడా ధరించడానికి ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే సినిమాలను ప్రదర్శిస్తారు. చౌమల్లా ప్యాలెస్‌లో వెల్‌కమ్ డిన్నర్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చార్మినార్ జోన్ పరిధిలోని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.
Also Read: పహల్గాం కుట్రదారులను చంపారా
బుధవారం ఓరుగల్లు పర్యటనకు..
మిస్‌వరల్డ్ పోటీదారులు బుధవారం ఓరుగల్లు పర్యటనకు రానున్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. తొలుత 35 మందితో కూడిన అందాల భామల బృందం వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను పరిశీలిస్తుంది. కాగా, 22 మంది అందగత్తెలతో కూడిన మరో బృందం హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుని.. అక్కడి శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తారు. పేరిణి నృత్య ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి హరిత కాటేజీల్లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్
For More AP News and Telugu News
Updated Date - May 13 , 2025 | 07:23 AM