ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rainy season: వర్షపు నీటిలో మునిగి వ్యక్తి మృతి..

ABN, Publish Date - May 28 , 2025 | 08:01 AM

Rainy season: మంగళవారం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో సూరారం కాలనీలో నివాసం ఉంటున్న పద్మారావు (40)అనే వ్యక్తి ఇంట్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న అతను ఊపిరి ఆడక మృతి చెందాడు. అయితే పోలీసులు ఏం చెబుతున్నారంటే..

Man drowns in rainwater

Hyderabad: సూరారం పోలీస్ స్టేషన్ (Suraram police station) పరిధిలో విషాదం నెలకొంది. సూరారం కాలనీలో పద్మారావు (Padma Rao) (40) అనే వ్యక్తి వర్షపు నీటిలో (Rain Water) మునిగి మృతి (Death)చెందాడు. మంగళవారం రాత్రి కురిసిన వర్షపు నీరు అతని ఇంట్లోకి చేరింది. ఈ క్రమంలో నిద్రిస్తున్న పద్మారావుకు ఊపిరి ఆడక మృతి చెందినట్లు తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని సమీక్షించారు. మద్యం మత్తులో ఉండటం వల్లనే మృతి చెందాడని నిర్ధారించారు. వర్షా కాలం సమీపిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను అధికారులు అప్రమత్తం చేయకుండా ఉండటం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


మంగళవారం రాత్రి భారీ వర్షం

కాగా హైదరాబాద్ వ్యాప్తంగా మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాదాపు 2 గంటలపైగా దంచికొట్టింది. మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, కొత్తగూడ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్‌ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు లోతట్టు ప్రాంత కాలనీల్లో వర్షపు నీరు చేరింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ వర్షం పడింది.

Also Read: గాలి జనార్దనరెడ్డి బెంగళూరుకు తరలింపు


అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని, రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించాలని సీఎస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


తడిసిన ధాన్యం..

మరోవైపు వర్షాలు రైతులను తీవ్ర ఇబ్బందులపాలు చేశాయి. మంగళవారం పలు జిల్లాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. దీంతో ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద ఆరబెట్టిన, బస్తాల్లో నింపిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. కళ్లాల్లో ఉన్న వరి కుప్పల్లోకి నీరు చేరింది. కుప్పలపై ప్లాస్టిక్ కవర్స్ కప్పినా ఫలితం లేకపోయింది. కొన్ని చోట్ల భారీ ఈదురుగాలులకు ప్లాస్టిక్ కవర్స్ కొట్టుకుపోయాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

10న విశాఖకు రాష్ట్రపతి

భారత్‌పై పవిత్ర యుద్ధమే లక్ష్యం

For More AP News and Telugu News

Updated Date - May 28 , 2025 | 08:01 AM