Share News

NIA Investigation: భారత్‌పై పవిత్ర యుద్ధమే లక్ష్యం

ABN , Publish Date - May 28 , 2025 | 05:55 AM

ఘజ్వా-ఎ-హింద్‌ భావజాలంతో యువతను రెచ్చగొట్టేందుకు సిరాజ్‌ సోషల్‌ మీడియాను వినియోగించినట్లు ఎన్‌ఐఏ విచారణలో వెల్లడైంది. అతడికి విదేశాల నుంచి ఆర్థిక సహాయం అందిందని, బ్యాంకు లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.

NIA Investigation: భారత్‌పై పవిత్ర యుద్ధమే లక్ష్యం

రెచ్చగొట్టే మతోన్మాద భావాలతో ముస్లిం యువతకు సిరాజ్‌ ఎర

విచారణలో విస్తుగొల్పే విషయాలు

విజయగనరం, మే 27(ఆంధ్రజ్యోతి): ‘ఘజ్వా-ఎ-హింద్‌ (భారత్‌పై పవిత్ర యుద్ధం) మన లక్ష్యం. ఒక్కటే ఉమ్మా (విశ్వాసం), ఒక్కటే సమాజం.. ఇదే మన ధ్యేయం..’ అనే రెచ్చగొట్టే మతోన్మాద భావాల ద్వారా సిరాజ్‌ సోషల్‌ మీడియా ఇన్‌స్ట్రాగ్రామ్‌, సిగ్నల్‌ యాప్‌ల ద్వారా అమాయక ముస్లిం యువతకు ఎర వేసే వాడని తెలిసింది. ఈ మేరకు ఐదో రోజు మంగళవారం కొనసాగిన ఎన్‌ఐఏ, ఏపీ, తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌, పోలీసుల విచారణలో అతడు చెప్పినట్లు సమాచారం. సిరాజ్‌ పోస్టులు చూసిన కొంత మంది అరబ్‌ దేశాల్లోని ఉగ్రమూకలు, అమాయక ముస్లిం యువకులు అతడికి దగ్గరైనట్లు సమాచారం. ఘజ్వా-ఎ-హింద్‌ భావనకు తాను ఆకర్షితుడయ్యానని, ఇతరులను కూడా ఆ వైపు మళ్లించే దిశగా చేశానని సిరాజ్‌ చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు వందలాది మందితో ఒక గ్రూపును తయారు చేయాలకున్నాట! సిరాజ్‌ భాష, అతనిలో భారత్‌పై ఉన్న విద్వేషం అరబ్‌ దేశాల్లోని కొంతమందికి నచ్చటంతో ఆర్థిక సాయానికి ముందుకొచ్చినట్లు తెలిసింది. వీరిమధ్య ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయనే దానితో పా టు సిరాజ్‌, అతని కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 05:55 AM