ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram Project: ముగియనున్న గడువు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫైళ్లు మాయం

ABN, Publish Date - Jun 30 , 2025 | 07:48 PM

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల రూపాయిలతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ ప్రాజెక్ట్‌లోని పలు ఫిల్లర్లు కృంగాయి.

Jala Soudha in Hyderabad

హైదరాబాద్, జూన్ 30: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. అయితే ఈ కమిషన్ విచారణ గడువు సైతం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అలాంటి వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన పలు డాక్యుమెంట్లు మాయమైనట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ వివరాలు ఇచ్చేందుకు తమకు మరి కొంత సమయం ఇవ్వాలని ఉన్నతాధికారులను ఇరిగేషన్ అధికారులు కోరినట్లు సమాచారం.

జలసౌధలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వివరాలు ఏవీ లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పరిధిలో పని చేసిన ఈఎన్‌సీల నుంచి వివరాలు సేకరించేందుకు తమకు సమయం పడుతుందని ఉన్నతాధికారులకు ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి.. కేబినెట్‌లో జరిగిన చర్చపై రికార్డులను ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు వెలికి తీసినట్లు సమాచారం. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు ఫిజికల్ డాక్యుమెంట్లను ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ ప్రాజెక్ట్ విచారణలో ఫైళ్లు సమర్పించేందుకు సోమవారం.. అంటే జూన్ 30వ తేదీతో గడువు ముగియనుందన్న విషయం తెలిసిందే.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల రూపాయిలతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ ప్రాజెక్ట్‌లోని పలు ఫిల్లర్లు కృంగాయి. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిని కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా మలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది.

ఆ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం.. జరిగిన అవకతవకలపై విచారణకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విచారణ చేపట్టి.. అధికారులు, సిబ్బందిని విచారించింది. అలాగే బీఆర్ఎస్ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌లను సైతం విచారించింది. ఈ కమిషన్ గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అలాంటి వేళ.. జలసౌధలోని ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక ఫైళ్లు మాయం కావడం పట్ల సర్వత్ర సందేహలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

రాజాసింగ్‌పై అగ్ర నాయకత్వం సీరియస్

లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..

పాశమైలారంలో పరిశ్రమ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసులు మోహరింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 07:48 PM