ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

HYDRA Demolition: మరోసారి హైడ్రా కూల్చివేతలు.. తెల్లవారుజాము నుంచే

ABN, Publish Date - May 06 , 2025 | 11:35 AM

HYDRA Demolition: హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. గచ్చిబౌలిలో భారీ కమర్షియల్ షెడ్లను హైడ్రా నేలమట్టం చేసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.

HYDRA Demolition

హైదరాబాద్, మే 6: హైడ్రా.. ఈ పేరు వింటేనే భూఆక్రమణదారుల గుండెల్లో హడల్. ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం రేవంత్ ప్రభుత్వం (Revanth Govt) హైడ్రాను (HYDRA) ఏర్పాటు చేసింది. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, చెరువులు, పార్కులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా హైడ్రా పని చేస్తోంది. భూ ఆక్రమణలకు పాల్పడిన వారి పట్ల కఠిన వ్యవహిస్తూ.. ఆ ఆక్రమణలను కూల్చివేస్తోంది. భూ ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చిరిస్తోంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో మళ్లీ కూల్చివేతలను మొదలుపెట్టింది హైడ్రా. ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా హైడ్రా కూల్చివేస్తోంది.


తాజాగా గచ్చిబౌలిలో ఈరోజు (మంగళవారం) ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భారీ కమర్షియల్ షెడ్లను నేలమట్టం చేసింది హైడ్రా. తెల్లవారుజాము నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో చాలా విలువైన ల్యాండ్‌ను సంధ్య కన్వెన్షన్ ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ స్థానికులు ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీసు బందోబస్తుతో ఇప్పటికే నిర్మించిన షెడ్లను కూల్చివేసింది. సంధ్య కన్వెన్షన్‌ సెంటర్‌ మినీ హాల్‌తో పాటు ఫుడ్ కోర్ట్‌లను హైడ్రా కూల్చివేసింది. ఈ భూమి సంబంధించి ఇప్పటికే హైకోర్టు, సుప్రీం కోర్టులో కేసులు కొనసాగుతున్నాయి.

Robbery Attempt: వీడో అమాయకపు దొంగ.. అసలు కథేంటంటే


ఈ క్రమంలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంధ్య శ్రీధర్‌ రావు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. అధికారులను సంధ్య కన్వెన్షన్ వద్దకు పంపించారు. దీంతో అక్కడ సైట్‌ను విజిట్ చేసి హైడ్రా అధికారులు.. అదంతా అక్రమమని నిర్ధారించారు. దీంతో వెంటనే కూల్చివేతలు చేయాలని హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయమే సిబ్బంది అక్కడకు చేరుకుని కూల్చివేతలు మొదలుపెట్టారు. గచ్చిబౌలిలో సర్వే నెంబర్ 124, 125లో దాదాపు 20 ఎకరాల స్థలం ఉంది. ఇదంతా కూడా ఎఫ్‌సీఏ సొసైటీకి సంబంధించిన లే అవుట్. ఎఫ్‌సీఐ సొసైటీ ఫ్లాట్ ఓనర్లు, సంధ్య శ్రీధర్‌ రావు మధ్య సుప్రీం కోర్టు, హైకోర్టులలో స్థల వివాదం కొనసాగుతోంది. కోర్టులలో వివాదం ఉన్నప్పటికీ వివాదాస్పద స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో భారీ పోలీసులు బందోబస్తు నడుమ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది.


కాగా.. మరోవైపు ఆక్రమణలు తొలగిస్తూ దూకుడు మీద ఉన్న హైడ్రా.. ఇకపై ఆక్రమణదారులను జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా బుద్ధభవన్‌లో హైడ్రా ప్రధాన కార్యాలయం పక్కనే ఒక ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు.


ఇవి కూడా చదవండి

Supreme Court Richest Judge: సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో సూపర్‌ రిచ్ ఎవరో తెలుసా

AP Govt: మాతృత్వ సెలవులు ఇక 180 రోజులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2025 | 11:41 AM