Share News

Robbery Attempt: వీడో అమాయకపు దొంగ.. అసలు కథేంటంటే

ABN , Publish Date - May 06 , 2025 | 10:51 AM

Robbery Attempt: మీర్‌పేట్‌లోని ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చాడో దొంగ. ఇంతలోనే యజమాని రావడంతో ఆ దొంగ.. తన దొంగ తెలివిని ఉపయోగించి మరీ ఒనర్‌ను బురిడీ కొట్టించాడు.

Robbery Attempt: వీడో అమాయకపు దొంగ.. అసలు కథేంటంటే
Robbery Attempt

హైదరాబాద్, మే 6: సాధారణంగా దొంగలు ఇళ్లలోకి చొరబడి.. ఇంట్లోని వస్తువులను దొంగతనం చేస్తుంటారు. అడ్డువచ్చిన వారిని భయపెట్టో లేదా బెదిరించైనా వారికి కావాల్సిన వాటిని దోచుకెళ్తారు. కొందరు కరుడు గట్టిన దొంగలైతే మానవత్వాన్ని మరిచి ఇంటి యజమానులను అత్యంత కిరాతంగా చంపి మరీ నగదును ఎత్తుకెళ్తారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే దొంగ మాత్రం వెరైటీ దొంగ అనే చెప్పుకోవాలి. అమాయకుడికి బ్రాండ్ అంబాసిడర్‌‌లా నటించి మరీ యజమానికి బురిడీ కొట్టించాడు. దొంగ చేసిన పని అవాక్కవడం యజమాని వంతైంది. ఇంతకీ ఆ దొంగ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం.


రాచకొండ మీర్‌పేటలో ఓ దొంగ అమాయకుడిలా నటించి మరీ యజమానికి బోల్తా కొట్టించాడు. గత అర్ధరాత్రి త్రివేణి నగర్‌లోని దొంగ ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే ఇంట్లోకి వెళ్లేందుకు తలుపులు, కిటికీలను పగులగొట్టేందుకు యత్నించాడు. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఆ ఇంటి యజమాని తలుపులు తెరిచి బయటకు వచ్చాడు. యజమాని రావడాన్ని గుర్తించి ఆ దొంగ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దొంగ పారిపోతే న్యూస్ ఎందుకవుతుంది చెప్పండి.. పారిపోకుండా అతడు చేసిన పనే ఇప్పుడు వార్తల్లోకి ఎక్కేలా చేసింది.

Andhra Pradesh: జగన్ కోటలో మహానాడు.. వైసీపీకి చుక్కలే..


ఇంటి యజమానిని చూసిన దొంగ ముందుగా పారిపోయేందుకు మెట్లు దూకాడు. కానీ ఇంటి యజమాని చప్పుడుతో వెంటనే వెనక్కి తిరిగి మెట్లెక్కి పైకి వచ్చాడు దొంగ. ఆ తరువాత అతడు చెప్పిన కహానీ విని నిజమనే అని నమ్మాడు ఓనర్. ఎవరో నలుగురు కింద ఉన్నారని ఇంటి యజమానికి చెప్పడమే కాకుండా అతడు నమ్మేలా వ్యవహరించాడు. ఇది నిజమే అని నమ్మిన సదరు ఓనర్.. దొంగతో కలిసి రోడ్డు మీదకు వచ్చాడు. దొంగలు ఎక్కడా అని యజమాని అరవడంతో ఇదే అదునుగా భావించిన ఆ అమాయకపు దొంగ.. యజమానిని బురిడీ కొట్టించి అక్కడి నుంచి పరుగందుకున్నాడు. ఈ విషయాలన్నీ కూడా అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దొంగ పారిపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు ఓనర్. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దొంగను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

Supreme Court Richest Judge: సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో సూపర్‌ రిచ్ ఎవరో తెలుసా

AP Govt: మాతృత్వ సెలవులు ఇక 180 రోజులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2025 | 10:55 AM