Share News

Andhra Pradesh: జగన్ కోటలో మహానాడు.. వైసీపీకి చుక్కలే..

ABN , Publish Date - May 06 , 2025 | 10:27 AM

కడప గడపలో ఈనెల 27, 28, 29న నిర్వహించే మహానాడును నభూతో నభవిష్యత్ నిర్వహించేందుకు టీడీపీ పక్కా ప్లాన్ చేస్తోంది. సోమవారం జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి చావు దెబ్బ కొట్టింది. మిత్రపక్షాలతో కలిసి మట్టికరి పించింది.

Andhra Pradesh: జగన్ కోటలో మహానాడు.. వైసీపీకి చుక్కలే..
TDP Mahanadu

  • 5 లక్షల మందితో బహిరంగ సభ

  • నాలుగు రోజుల ముందే కడపలో మంత్రి లోకేశ్ మకాం

  • జిల్లా సమగ్రాభివృద్ధికి స్పష్టమైన డిక్లరేషన్

  • రేపు భూమిపూజ

  • ఇన్ చార్జ్ మంత్రి సవిత, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హాజరవనున్నట్లు సమాచారం.

కడప, మే 06: కడప గడపలో ఈనెల 27, 28, 29న నిర్వహించే మహానాడును నభూతో నభవిష్యత్ నిర్వహించేందుకు టీడీపీ పక్కా ప్లాన్ చేస్తోంది. సోమవారం జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి చావు దెబ్బ కొట్టింది. మిత్రపక్షాలతో కలిసి మట్టికరి పించింది. ఇది రాష్ట్రంలోనే సంచలనమైంది. ఇక జగన్ కోటలో మహానాడును కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. జగన్ సొంత గడ్డ కడపలోనే మహానాడును భారీ సక్సెస్ చేసి టీడీపీ తన పూర్వవైభవం కోసం అడుగులు వేస్తోంది. స్టేట్‌లో ఇతర జిల్లాల్లో ఇప్పటి దాకా నిర్వహించిన మహానాడు ఒక ఎత్తు అయితే, ఈసారి కడపలో నిర్వహించనున్న మహానాడు మరో ఎత్తు కానుంది. అందుకే మహానాడును భారీ సక్సెస్ చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారాలోకేశ్ కార్యక్రమానికి నాలుగురో జుల ముందే కడపలో మకాం వేసి దగ్గరుండి ఏర్పాట్లు, ఇతరత్రా పర్యవేక్షించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.


ప్రతిష్టాత్మకంగా మహానాడు..

ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ ఆవిర్భావం నుంచి 2004 ముందు వరకు టీడీపీ ఎమ్మెల్యేలే గెలుస్తూ వచ్చేవారు. బద్వేలు, జమ్మలమడుగు, కడప, రైల్వేకోడూరు ఇలా కొన్ని నియోజకవర్గాలు కంచుకోటలా ఉండేవి. రాజశేఖర్ రెడ్డ సీఎం అయిన తరువాత పరిస్థితి మారిపోయింది. ఆ తరువాత 2024 ఎన్నికల్లో పార్టీ పుంజుకుంది. ఉమ్మడి జిల్లాలో ఏడు స్థానాలు కూటమికి వచ్చాయి. సొంత జిల్లాలో వైసీపీ చతికిలబడడం ఆ పార్టీ ఊహించలేకపోయింది. ఆ షాక్ నుంచి కోలుకోక మునుపే మళ్లీ మహానాడును కడపలో నిర్వహించి సీమ అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక రోడ్ మ్యాప్ గీసి అటు పరిశ్రమలు, ఇటు వ్యవసాయరంగంపై పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు. కడపకు వచ్చే భారీ ప్రాజెక్టులను సస్పెన్స్‌లో ఉంచారు. మహానాడు వేదికగా ఆ వివరాలను సీఎం చంద్రబాబు వెల్లడిస్తారని చెబుతున్నారు. వైజాగ్, చెన్నై పారిశ్రామిక కారిడార్లో భాగంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఇది పూర్తయితే.. పరిశ్రమలు క్యూ కడతాయి. ఇప్పటికే కొప్పర్తిలో పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.


ఉక్కుపై ముందుకు..

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జిల్లావాసులు చిరకాల వాంఛ అయితే మూడేళ్లలో స్టీలు ఫ్యాక్టరీ పూర్తి చేస్తామని జగన్ కొబ్బరికాయ కొట్టారు. ఐదేళ్లు పూర్తయ్యే సరికి కనీసం ప్రహ రీగోడ కూడా పూర్తి చేయలేకపోయారు. కాగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. జిందాల్‌తోనే నిర్మాణం చేపడుతుందని అంటున్నారు. దీంతో పాటు ఇక మహానాడు సక్సెస్ చేసి టీడీపీలో మరింత జోష్ నింపాలని భావిస్తున్నారు. ఇందుకు మంత్రి నారా లోకేశ్ నాలుగు రోజులు ముందుగానే కడపలో మకాం వేసి అందరినీ సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


రేపే భూమి పూజ..

కడప నగర శివారులోని పబ్బాపురంలో ఉన్న 120 ఎకరాల టీచర్స్ లేఅవుట్‌లో మహానాడు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. అయితే రేపు స్టేజీ ఇతర నిర్మాణాల కోసం భూమి పూజ చేయనున్నారు. కార్యక్రమానికి కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవితతో పాటు రాయలసీమకు చెందిన పలువురు మంత్రులు హాజరు కానున్నారు. భూమిపూజకు రావాల్సిందిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను కూడా ఆహ్వానించినట్లు శ్రీనివాస రెడ్డి తెలిపారు. మహానాడు లేఅవుట్ తయారు చేసి ఎక్కడెక్కడ స్టేజీ, ప్రతినిధుల సమావేశం కోసం ఏర్పాటు చేసే మీటింగ్ హాలు, గ్యాలరీలు, పార్కింగ్, సీఎం చంద్రబాబుకు బస, వసతి, భోజన శాలలు, వీఐపీలకు ప్రత్యేక భోజనశాల, రక్తదాన శిబిరం, ఫొటో ఎగ్జిబిషన్ తదితరాలు నిర్ణయించనున్నారు.


కమిటీలు..

ఇక మహానాడును సక్సెస్ చేసేందుకు సమన్వయం కోసం పలు కమిటీలను నియమించనున్నారు. వేదిక, ఆహ్వానం, వంట తదితరాల కోసం పలు కమిటీలను ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను చేయనున్నారు.


చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు..

కడపలో నిర్వహించే మహానాడు చరిత్రలో నిలిచిపోనుంది. చివరి రోజున ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగనున్నది. జగన్ ఐదేళ్లలో స్టీలు ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయడమే తప్ప దాన్ని పూర్తి చేయలేదు. జిందాల్తోనే స్టీలు ఫ్యాక్టరీ పూర్తి చేస్తాం.. ఒప్పందం కూడా జరిగిపోయింది. కడప జిల్లా సమగ్రాభివృద్ధికి ఓ ప్రత్యేక డిక్లరేషన్‌ను మహావేదికలో చంద్రబాబు ప్రకటిస్తారు. మహానాడు సక్సెస్‌తో వైసీపీ కోలుకోలేని విధంగా మారుతుంది అని పార్టీ జిల్లా అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డ తెలిపారు.


Also Read:

దోసకాయను ఇలా తింటేనే హెల్త్ బెనిఫిట్స్..

మరి మా సంగతేంటి.. బేబీ దర్శకుడు ఫైర్

ఏపీపీఎస్సీ నియామకం కేసులో కీలక పురోగతి...

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 06 , 2025 | 10:27 AM