ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

ABN, Publish Date - Jul 17 , 2025 | 06:01 PM

హైదరాబాద్‌లోని మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, హకీంపేట్‌, కంటోన్మెంట్‌, ఖైరతాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఆయా ప్రాంతాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించింది.

Heavy Rains

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, కేపీహెచ్బీ(KPHB), నిజాంపేట్‌, మియాపూర్‌, మూసాపేట్‌ సహా బాలానగర్‌, సనత్‌నగర్‌, ఎర్రగడ్డలో వాన దంచికొడుతోంది. అలాగే మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, హకీంపేట్‌, కంటోన్మెంట్‌, ఖైరతాబాద్‌లోనూ భారీగా వర్షం పడుతోంది. ఆయా ప్రాంతాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించింది.

మరోవైపు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోగా.. పలువురు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. కాగా, వర్షం నేపథ్యంలో అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. వర్షం తగ్గేంత వరకూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సైతం సూచనలు చేసింది.

మూడ్రోజులపాటు..
కాగా, తెలంగాణలో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ్టి(గురువారం) నుంచి శనివారం వరకూ తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు కురవనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి వరంగల్, హనుమకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఆయా జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

Updated Date - Jul 17 , 2025 | 06:32 PM