GHMC: మరోసారి జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం
ABN, Publish Date - Feb 21 , 2025 | 03:00 PM
GHMC: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక మరోసారి ఏకగ్రీవమైంది. సంఖ్యా బలం లేకపోవడంతో బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 21: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక (GHMC standing committee elections) ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో 15 మంది సభ్యులకు గాను 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎఐఎంఐ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి ఏడుగురు, బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఇద్దరు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు తమ నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 15 మంది స్టాండింగ్ కమిటీలో ఎంఐఎం నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7 సభ్యులు ఉండనున్నారు.
బలం లేకపోవడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. గతంలో బీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్ వేయగా.... అధిష్టానం ఆదేశంతో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. గత పదేళ్లుగా స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అవుతూ వస్తున్నాయి. అలాగే గత పదేళ్లలో తొలిసారి కాంగ్రెస్ కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీలో చోటు దక్కించుకున్నారు.
కాగా.. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ప్రతీ ఏడాది ఎన్నుకోవడం జరుగుతుంది. జీహెచ్‌ఎంసీలో పాలనాపరంగా, కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా మేయర్, డిప్యూటీ మేయర్ అనంతరం ఈ 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎంతో కీలకం. గడిచిన పదేళ్ల వ్యవధిలో ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగలేదు. ప్రతీసారి కూడా ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతూనే ఉంది. ఈ సారి కూడా సంఖ్యాబలం లేకపోవడంతో బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు తప్పుకోవడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
ఇవి కూడా చదవండి...
2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Feb 21 , 2025 | 03:02 PM