OMC Case: గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో ఊరట
ABN, Publish Date - Jun 11 , 2025 | 11:14 AM
OMC Case: ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ కేసులో గాలి సహా దోషులందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
హైదరాబాద్, జూన్ 11: ఓబులాపురం మైనింగ్ కేసులో కారాగార శిక్ష అనుభవిస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి (Gali Janardhan Reddy) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఊరట లభించింది. ఈ కేసులో దోషులందరికీ ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ న్యాయస్థానం తీర్పు ఇవ్వగా.. దానిని హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో గాలితో పాటు ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షలతో రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇండియా విడిచి ఎక్కడికి వెళ్లిపోవడానికి వీలులేదని స్పష్టం చేసింది. అలాగే పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా నలుగురు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ గత నెల 6న నాంపల్లి సీబీఐ కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం గాలి చంచల్ గూడ జైలులో ఉన్నారు. అయితే సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో కర్ణాటక ఎమ్మెల్యే మధ్యంతర పిటిషన్‌ను దాఖలు చేశారు. అలాగే మిగిలిన నిందితులు బెయిల్ పిటిషన్‌లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో నిన్నటికి (మంగళవారం) వాదనలు ముగిశాయి.
ఇప్పటికే గాలి జానార్దన్ రెడ్డి మూడున్నరేళ్లు జైలు శిక్ష అనుభవించారని, మరో మూడున్నరేళ్ల శిక్ష మాత్రమే మిగిలి ఉందన్నారు. అయితే బెయిల్ విషయంలో సీబీఐ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ జైలు శిక్షను సస్పెండ్ చేసే విషయంలో మాత్రం వ్యతిరేకత చూపింది. వాదనలు విన్న హైకోర్టు జడ్జి ఈరోజు (బుధవారం) తీర్పును వెల్లడిస్తామని తెలిపారు. తాజాగా ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి శాసనసభ సభ్యత్వం పోకుండా సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. అలాగే గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం కమిషన్ విచారణకు బయల్దేరిన కేసీఆర్
నాన్న స్ఫూర్తితో పతకాల వేట
Read latest Telangana News And Telugu News
Updated Date - Jun 11 , 2025 | 12:22 PM