ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gaddar Awards: గద్దర్ అవార్డులపై బాలయ్య, విజయ్ ఏమన్నారంటే

ABN, Publish Date - May 30 , 2025 | 03:14 PM

Gaddar Awards: గద్దర్ ఫిల్మ్ అవార్డులపై ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ స్పందించారు. తమకు వచ్చిన అవార్డులపై వారు ఆనందం వ్యక్తం చేశారు.

Gaddar Awards:

హైదరాబాద్, మే 30: 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రముఖ సినీ నటుడు, జ్యూరీ ఛైర్మన్‌ మురళీ మోహన్‌ (Murali Mohan) ఈరోజు (శుక్రవారం) ప్రకటించారు. ఏడాదికి మూడు చొప్పున ఉత్తమ సినిమాలకు అవార్డులను ప్రకటించారు. వీటితో పాటు సినీ రంగానికి సేవలు అందించిన వారికి ఆరు ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్లు మురళీమోహన్ తెలిపారు. ఈ ఆరుగురిలో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు (Nandamuri Balakrishna) ఎన్టీఆర్ జాతీయ అవార్డు వరించగా.. హీరో విజయ్ దేవరకొండకు (Vijay Devarakonda) కాంతారావు స్మారక అవార్డును ప్రకటించారు. ఈ అవార్డులపై బాలయ్య , విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.


ఇది దైవ నిర్ణయం: బాలకృష్ణ

ఎన్టీఆర్ జాతీయ అవార్డును తనకు ప్రకటించడం అదృష్టమని, ఇది దైవ నిర్ణయంగా, నాన్న ఆశీర్వాదంగా భావిస్తున్నానని నటుడు బాలయ్య తెలిపారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు ప్రభుత్వం, సీఎం రేవంత్, జ్యూరీ సభ్యులకు కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు. ‘ఎన్టీఆర్ శ‌తజ‌యంతి ఉత్స‌వాలు పూర్తి చేసుకున్న అద్భుత‌మైన ఘ‌డియ‌లు ఒక వైపు.. ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు.. నటుడిగా నేను 50 ఏళ్ళ స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్‌తో సత్కరించిన ఇలాంటి త‌రుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ను నాకు ప్ర‌క‌టించ‌డం నా అదృష్టంగా, దైవ నిర్ణ‌యంగా, నాన్న ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇంత‌టి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పుర‌స్కారానికి న‌న్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్ర‌భుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జ్యూరీ స‌భ్యుల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేస్తున్నాను. ప్ర‌పంచం న‌లుమూల‌లా ఉన్న తెలుగు ప్ర‌జ‌ల దీవెన‌లు, నాన్న చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లవేళలా ఇలానే ఉండాల‌ని కోరుకుంటున్నాను’ అంటూ నందమూరి బాలకృష్ణ తెలిపారు.


చాలా ఆనందంగా ఉంది: విజయ్ దేవరకొండ

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై నటుడు విజయ్ దేవరకొండ స్పందించారు. కాంతారావు స్మారక అవార్డు ప్రకటించడం గౌరవంగా ఉందని అన్నారు. నట ప్రపూర్ణ కాంతారావు పేరిట ఈ గౌరవం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. 2016లో పెళ్లి చూపులు చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పెళ్లి చూపులు చిత్రానికి తన హృదయంలో ఎల్లప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఈ గౌరవం, ఆనందం అభిమానులదే అని.. వారి ప్రేమ తనను నడిపిస్తూనే ఉందన్నారు. ‘నా ప్రయాణంలో తోడుగా ఉన్న కుటుంబానికి, దర్శకులకు, టీమ్‌కు’ విజయ్ దేవరకొండ ధన్యవాదాలు తెలియజేశారు. ఇక 2024 ఏడాదికి సంబంధించిన అవార్డులను కమిటీ నిన్ననే (గురువారం) ప్రకటించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

కరీంనగర్‌ నుంచి కుట్రలు.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు

అన్నింటినీ భరించుకుంటూ వచ్చా.. సిన్సియర్‌గా పనిచేశా.. అయినప్పటికీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 31 , 2025 | 09:22 AM