Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం.. కన్న కూతురుపై
ABN, Publish Date - Jun 24 , 2025 | 10:48 AM
Hyderabad News: హైదరాబాద్‌లోని బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తన రక్తం పంచుకుని పుట్టిన కన్న బిడ్డనే చెరబట్టాలని ప్రయత్నించాడు ఓ తండ్రి. మద్యం ఎలాంటి వారిని ఎలా మారుస్తుందో అందరికీ తెలిసిందే.
హైదరాబాద్, జూన్ 24: మానవసంబంధాలు ఎటు పోతున్నాయో తెలియడం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి పట్ల ఓ తండ్రి ప్రవర్తించిన తీరు చూస్తుంటే అసలు బంధాలు బతికున్నాయా అని అనిపిస్తుంది. ఆడబిడ్డలకు తండ్రి అంటే వల్లమాలిన ప్రేమ. ఒకప్పుడు ఇంటి యజమానితో ఎంతో భయం, బాధ్యతతో ఉండేవారు. కానీ ఇప్పటి తండ్రులు పిల్లలతో స్నేహంగా ఉంటూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా తనలోనే దాచుకుని.. తమ కన్న బిడ్డలకు మాత్రం ఏ కష్టం రానీయకుండా చూసుకుంటున్నారు తండ్రులు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి గురించి తెలిస్తే.. తండ్రంటేనే ఆడపిల్లలు భయపడిపోతారేమో. కన్న బిడ్డను రక్షించాల్సిన తండ్రే భక్షకుడిగా మారాడు. కామాంధుల చెర నుంచి కాపాడాల్సిన ఆ తండ్రి.. బిడ్డకు అంతులేని దు:ఖాన్ని మిగిల్చాడు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్‌లోని బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తన రక్తం పంచుకుని పుట్టిన కన్న బిడ్డనే చెరబట్టాలని ప్రయత్నించాడు ఓ తండ్రి. మద్యం ఎలాంటి వారిని ఎలా మారుస్తుందో అందరికీ తెలిసిందే. మద్యం సేవిస్తే ఎదుట ఉంది భార్యో, కూతురో కూడా తెలియకుండా విచక్షణ మరిచి ప్రవర్తించాడు ఓ తండ్రి. స్థానికంగా ఉంటున్న సదరు వ్యక్తి తాగుడుకు బానిసయ్యాడు. ఇంటిని పోషించకపోవడంతో పాటు సంపాదిస్తున్న భార్యను కూడా చిత్రహింసలకు గురిచేసేవాడు. అంతటితో ఆగకుండా కన్న కూతురిపట్ల కూడా దారుణంగా ప్రవర్తించాడు.
మద్యం మత్తులో కూతురి శరీర భాగాలు తాకి వేధింపులకు గురిచేశాడు. భయపడిపోయిన కూతురు పెద్దగా కేకలు వేయడంతో వెంటనే అక్కడకు చేరుకున్న తల్లి.. అతని నుంచి కుమార్తెను రక్షించుకుంది. ఆపై పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఈ దారుణ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మద్యం తాగి తరచూ తనపై, తన బిడ్డపై విచక్షణారహితంగా దాడి చేస్తాడని భార్య ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కన్న బిడ్డపై తండ్రే ఇలాంటి దారుణానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి
రియల్ మోసం.. వైసీపీ నేత కుమారుడి అరెస్ట్
ఏపీలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు అమోదం..
ఏరో స్పేస్ డిఫెన్స్‌లో లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 24 , 2025 | 05:26 PM