Share News

CM Chandrababu: ఏరో స్పేస్ డిఫెన్స్‌లో లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:54 AM

రానున్న ఐదేళ్లలో ఎరో స్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఆకరించడమే లక్షమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో డీఆర్‌డీవో ఎక్స్‌లెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

CM Chandrababu: ఏరో స్పేస్ డిఫెన్స్‌లో లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం

  • విశాఖ-శ్రీకాకుళంలో నావల్‌ క్లస్టర్‌

  • జగ్గయ్యపేట-దొనకొండలో మిస్సైల్‌

  • రాష్ట్రంలో డీఆర్‌డీవో ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌

  • మడకశిరకు భారత్‌ ఫోర్జ్‌, బీఎండబ్ల్యూ

  • 2025-30 పాలసీ సమీక్షలో చంద్రబాబు

అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): రానున్న ఐదేళ్లలో ఎరో స్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఆకరించడమే లక్షమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో డీఆర్‌డీవో ఎక్స్‌లెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మడకశిర నియోజకవర్గంలో భారత్‌ ఫోర్జ్‌, బీఎండబ్ల్యూ సంస్థలు త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించడంపై సంతోషం వ్యక్తం చేశారు. సచివాలయంలో సోమవారర మంత్రులు టీజీ భరత్‌, కొండపల్లి శ్రీనివా్‌సతో కలసి 2025-30 ఎరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగ పాలసీపై అధికారులతో సీఎం సమీక్షించారు. రక్షణ, అంతరిక్ష రంగంలో భారీగా పెట్టుబడులు ఆకర్షించేలా ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ పాలసీ ఉండాలని సీఎం తెలిపారు. కొత్త పాలసీ ద్వారా రానున్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు 4.0 పాలసీ ఉండాలని చెప్పారు. రక్షణ, ఏరోస్పేస్‌ రంగంలో నూతన సాంకేతికతతో కూడిన ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చేలా 4.0 ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో దేశం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విజయం సాధించిందని అధికారులకు సీఎం వివరించారు. ఈ తరహా సాంకేతికతను రక్షణ రంగంలో వాడుకోవడంతో పాటు.. వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసి, దైనందిన జీవితంలోనూ ఉపయోగించేలా పరిశోధనలతో కూడిన పెట్టుబడులను రక్షణ, భద్రతా రంగంలో వచ్చేలా కృషి చేయాలన్నారు.


పెట్టుబడులు తెచ్చేవి అవే!

దేశ రక్షణ, అంతర్గత భద్రతా రంగాల్లో భవిష్యత్తులో పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలుండేలా 4.0 ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పాలసీ తీసుకురావాలని అదికారులకు స్పష్టం చేశారు. జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఉండేలా పాలసీలో మార్పులు, చేర్పులు చేయాలని చెప్పారు. ఈ సమావేశానికి ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ రంగ సలహాదారు సతీశ్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు.


ప్రాంతాల వారీగా పరిశ్రమలు

ప్రాంతాల వారీగా ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పరిశ్రమలు స్థాపించేలా కార్యాచరణను రూపొందించాలని పరిశ్రమల శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ-శ్రీకాకుళంలో నావల్‌ క్లస్టర్‌, జగ్గయ్యపేట- దొనకొండ ప్రాంతాలలో మిస్సైల్‌, ఆయుదాల తయారీ, కర్నూలు-ఓర్వకల్లులో మనవరహిత విమానాలు, డ్రోన్ల తయారీ, లేపాక్షి-మడకశిర క్లస్టర్‌లో ఏరోస్పేస్‌, ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. డీఆర్‌డీవో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పాలని సీఎం స్పష్టం చేశారు. తిరుపతిని రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. మరోవైపు మడకశిర క్లస్టర్‌లో భారత్‌ ఫోర్జ్‌, బీఎండబ్ల్యూ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో 23 సంస్థలు ఇప్పటికే రూ.22,000 కోట్ల పెట్టుబడులను పెట్టాయని అధికారులు వివరించారు.


ఎంఎ్‌సఎంఈలకు ప్రోత్సాహం

మిగిలిన రాష్ట్రాల కంటే ఎంఎ్‌సఎంఈ ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రోత్సహించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికోసం ఏడాదికి ప్రత్యేకంగా రూ.100 కోట్లతో కార్ప్‌సఫండ్‌ ఏర్పాట చేయాలన్నారు. లాజిస్టిక్స్‌కు సబ్సిడీ ఇవ్వాలని చెప్పారు. ఎంఎ్‌సఎంఈలను బలోపేతం చేయాలని, అనుంబంధ పరిశ్రమల్లో ఉత్పత్తుల నాణ్యతలో ఒక విధానం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

గుజరాత్‌లో బీజేపీ, ఆప్‌కు చెరో సీటు, కేరళలో కాంగ్రెస్ గెలుపు

6 రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

For National News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 05:41 AM