ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RTC Strike: తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్‌డౌన్..

ABN, Publish Date - May 01 , 2025 | 08:11 AM

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు.

TG RTC Strike

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో ఆర్టీసీ సమ్మెకు (RTC Strike) కౌంట్‌డౌన్ (Countdown) మొదలైంది. ఈ నెల 7వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోతాయని ఆర్టీసీ జేఏసీ నేతలు (RTC JAC Leaders) తెలిపారు. సమ్మెలో 40వేల మంది కార్మికులు పాల్గొంటారన్నారు. సమ్మె నోటీసు ఇచ్చి మూడు నెలలు అవుతున్నా.. ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలవకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు వెళుతున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. ఆర్టీసీ పరిరక్షణ, ఇతర సమస్యల పరిష్కారంపై కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు 21 ప్రధాన సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్లతో 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటించింది.


సమ్మెకు వెళ్లొద్దు, సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం

కాగా ఆర్టీ సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమ్మె నిర్ణయంపై పునరాలోచించాలని అన్నారు. ప్రస్తుతం సమ్మె చేయాల్సిన పరిస్థితిలో ఆర్టీసీ లేదని ఆర్టీసీ సమస్యల పరిష్కారినికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. గత పదేళ్లలో ఆర్టీసీలో పెండింగ్ పీఎఫ్ బకాయీలను చెల్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సమ్మెకు వెళ్లొద్దని యూనియన్లకు మంత్రి పొన్నం సూచించారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తోందని, ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.పెండింగ్‌ బకాయిలు, టీఏ, డీఏలు చెల్లించడంతోపాటు ఆర్టీసీలో కొత్త నియామకాలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె చేపడితే ఇబ్బందులు వస్తాయని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

Also Read: CM Chandrababu: నెల్లూరు జిల్లా పర్యటనకు..


కార్మికుల అసంతృప్తి..

కాగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు ఇటీవల కాలంలో ఆర్టీసీలో విద్యుత్‌ బస్సుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు డిపోలను విద్యుత్‌ బస్సులు సమకూరుస్తున్న సంస్థలకే అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు.

దీని వల్ల ఆర్టీసీ కార్మికుల్ని ఇతర డిపోలకు మారుస్తున్నారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు పనిభారం పెరిగిందని జేఏసీ నేతలు చెబుతున్నారు. పనిభారం, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సమ్మె తప్ప మరో మార్గం కనిపించడం లేదని జేఏసీ నేతలు వెల్లడించారు. ‘‘ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఈవీ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన విరమించుకోవాలి. ప్రభుత్వానికి ఆర్టీసీపై ప్రేమ ఉంటే రూ. 5 వేల కోట్లు కేటాయించాలి. ఈవీ బస్సుల్ని స్వాగతిస్తున్నాం.. కానీ ప్రైవేటు సంస్థలకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇవే అంశాలపై సమ్మె నోటీసు ఇచ్చాం’’ అని జేఏసీ నేతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం కొనుగోళ్లలో అదే జోరు..

పహల్గాం దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి

For More AP News and Telugu News

Updated Date - May 01 , 2025 | 08:12 AM