CM Revanth Reddy: విద్య, వైద్యానికే అధిక ప్రాధాన్యం: సీఎం రేవంత్
ABN, Publish Date - Jul 02 , 2025 | 01:34 PM
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని.. అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్‌గా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.హైదరాబాద్‌ను హెల్త్ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
హైదరాబాద్, జులై 2: నగరంలోని బంజారాహిల్స్‌లో ఏఐజీ ఆస్పత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు (బుధవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నగర ప్రజలకు రెండో అతిపెద్ద హాస్పిటల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని అభినందించారు. హైదరాబాద్, తెలంగాణకు నాగేశ్వర్ రెడ్డి గొప్ప పేరు తీసుకొచ్చారని.. ఆయన సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చిందని తెలిపారు. నాగేశ్వర్ రెడ్డి భారతరత్నకు అర్హులన్నారు. ఆయనకు భారతరత్న వచ్చేలా తెలంగాణ నుంచి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. 66 దేశాల నుంచి పేషంట్స్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సకు వస్తున్నారని ఇది గర్వకారణమన్నారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని.. అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్‌గా ఉంటుందని సీఎం తెలిపారు.హైదరాబాద్‌ను హెల్త్ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. అందులో భాగంగానే డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని క్యాన్సర్ కేర్ సలహాదారుడిగా నియమించామన్నారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టే ప్రణాళికలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని కూడా భాగస్వాములు కావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందిస్తోందన్నారు. సమస్య రాకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉందని.. ఇందుకు సరైన విధానంతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు హెల్త్ ప్రొఫైల్ కార్డును క్రియేట్ చేయాలని భావిస్తున్నామన్నారు. ఒక యూనిక్ ఐడీతో ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఉంటాయని తెలిపారు. ఒకప్పుడు ఉన్న ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థపోయి ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్స్ రోజులు వచ్చాయన్నారు. హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం ద్వారా దీన్ని బ్రేక్ చేయొచ్చని సీఎం అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతున్నామని చెప్పడానికే మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్‌కు ఏఐజీ హాస్పిటల్ విజిట్ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. గోశామహల్‌లో నూతన ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించబోతున్నామని.. పనులు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. నిర్మాణంలో ఉన్న వివిధ ఆసుపత్రులు పూర్తైతే మొత్తం 7 వేల పడకలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తామని స్పష్టంచేశారు. వైద్య రంగం అభివృద్ధికి రూ.11500 కోట్లు కేటాయించామని.. రూ.21500 కోట్లు విద్యా రంగం అభివృద్ధికి కేటాయించామని తెలిపారు. పేదలకు ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య అందించాలనే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాని పేర్కొన్నారు. వైద్యులు ఏడాదిలో ఒక నెల రోజులు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలందించాలన్నారు. సాంకేతిక రంగంలో ప్రపంచంలో హైదరాబాద్ కూడా ఒక వేదికగా మారిందని అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి హైదరాబాద్‌కు డైరెక్ట్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని.. కనెక్టివిటీ పెరిగితే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మృతుల కుటుంబాలకు కోటి పరిహారం.. సిగాచి యాజమాన్యం ప్రకటన
మంత్రి దామోదరతో బాధితుల వాగ్వాదం.. సర్దిచెప్పిన మినిస్టర్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 02 , 2025 | 01:43 PM