Hyderabad Fire Accident: అగ్నిప్రమాద బాధితులకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా..
ABN, Publish Date - May 18 , 2025 | 03:41 PM
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు ఒక్కొక్కరికీ రూ.5లక్షలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
హైదరాబాద్: పాతబస్తీ(Old City)లో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కొక్కరికీ రూ.5లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అగ్నిప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమన్న భట్టి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరితో మాట్లాడుతూ ఘటనపై వేగంగా స్పందించారని చెప్పారు.
అగ్నిప్రమాద ఘటన జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్వయంగా ఫైర్ శాఖ సహా సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్నారని భట్టి చెప్పారు. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రాథమికంగా తేలిందన్న భట్టి.. విపరీతమైన పొగ చెలరేగడంతో ఊపిరాడక 17 మంది మృతిచెందారని తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా నిలబడతామని, అగ్నిప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని డిప్యూటీ సీఎం అన్నారు.
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అగ్నిప్రమాద స్థలానికి హుటాహుటిన వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.20లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరింది. ఘటన చాలా దురదృష్టకరమన్న ఆ పార్టీ నేత హరీశ్ రావు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండాలన్నారు.
ఇవి కూడా చదవండి
Sai Rajeshs Film: సాయి రాజేష్‌కు షాకిచ్చిన బాబిల్.. బేబీ రీమేక్‌నుంచి ఔట్..
Tragedy After Marriage: కొత్త జీవితం ఇంత విషాదంగా ముగుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు..
కేక పుట్టించిన ప్రపంచ సుందరాంగులు
Updated Date - May 18 , 2025 | 05:02 PM