Tragedy After Marriage: కొత్త జీవితం ఇంత విషాదంగా ముగుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు..
ABN , Publish Date - May 18 , 2025 | 08:09 AM
Tragedy After Marriage: పెళ్లి కొడుకు ఉన్నట్టుండి పెళ్లి పీటలపైనే కుప్పకూలాడు. దీంతో అందరూ షాక్ అయ్యరు. వెంటనే అతడ్ని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
ఈ మధ్య కాలంలో గుండె పోటు మరణాలు బాగా ఎక్కువయిపోయాయి. చిన్న పిల్లలు, యువత కూడా గుండె పోటు బారిన పడి చనిపోతున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా, కర్ణాటకలో ఓ పెను విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన కొన్ని నిమిషాలకే వరుడు చనిపోయాడు. పెళ్లి కూతురు జీవితంలో తీరని విషాదాన్ని మిగిల్చి వెళ్లిపోయాడు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా కుంబరెహళ్లికి చెందిన 26 ఏళ్ల ప్రవీణ్ కుర్నే ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.
అతడికి బెలగావి జిల్లా పార్థనహళ్లికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయం అయింది. ఆ యువతి ప్రవీణ్ మేనమామ కూతురు. మే 17వ తేదీన ( శనివారం) జమ్‌ఖండిలోని నందికేశ్వర కల్యాణ మండపంలో ఇద్దరి పెళ్లి జరిగింది. పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురి మెడలో తాళి కట్టాడు. తాళి కట్టిన 15 నిమిషాలకే ఊహించని విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు ఉన్నట్టుండి పెళ్లి పీటలపైనే కుప్పకూలాడు. దీంతో అందరూ షాక్ అయ్యరు. వెంటనే అతడ్ని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
ఈ ఊహించని విషాదంతో కుటుంబసభ్యులతో పాటు పెళ్లికి వచ్చిన వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. పెళ్లి కూతురు పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. బావతో కలిసి జీవించాలని ఇన్ని రోజులు కలలుగంది. ఎంతో ఊహించుకుంది. మూడు ముళ్లు పడ్డ తర్వాత కొన్ని నిమిషాలు కూడా ఆ సంతోషం లేకుండా పోయింది. మృత్యువు రూపంలో కలలు గన్న జీవితం ఆవిరి అయిపోయింది. ప్రవీణ్ కుటుంబసభ్యులు అతడి శవం దగ్గర కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
Gold And Silver Rate: పసిడి ప్రియులకు ఊరట.. నిలకడగా బంగారం ధరలు..
PSLV C 61: పీఎస్‌ఎల్వీ సీ 61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య