Fraud Case: శ్రవణ్ రావును విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు
ABN, Publish Date - May 14 , 2025 | 01:27 PM
Fraud Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు శ్రవణ్ రావును చీటింగ్ కేసులో అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఏ4గా శ్రవణ్ రావు భార్య స్వాతి రావును చేర్చారు. ఆమెను కూడా సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో నిందితుడు శ్రవణ్ రావు (Sravan Rao)ను విచారిస్తున్న సీసీఎస్ పోలీసుల (CCS police) విచారణ కొనసాగుతోంది. అఖండ ఇండియా టెక్ ప్రయివేటు లిమిటెడ్‌ను మోసం చేసిన కేసు (Fraud Case)లో శ్రవణ్ రావును అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ4గా శ్రవణ్ రావు భార్య స్వాతి రావును చేర్చారు. స్వాతిరావును కూడా సీసీఎస్ పోలీసులు విచారణ చేయనున్నారు. ఇన్ రథమ్ ఎనర్జీ ప్రయివేటు లిమిట్ డైరెక్టర్ అని చెప్పి శ్రవణ్ రావు మోసం చేశారు. ముడి ఇనుము సరఫరా చేసేందుకు అఖండ ఇండియా టెక్ ప్రయివేటు లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. టన్నుకు రూ. 300 లాభం వస్తుందని చెప్పి రూ. 6.5 కోట్లు వసూలు చేసి.. మోసం చేసినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో భర్త శ్రవణ్ రావుతో కలిసి భార్య స్వాతి రావు మోసం చేసినట్లు నిర్ధారించారు.
కాగా బెంగళూరులోని తన కంపెనీ నుంచి ఇనుప ఖనిజం కొనుగోలు చేస్తే అధిక లాభాలు ఇస్తానని నమ్మించిన శ్రవణ్‌రావు.. హైదరాబాద్‌లోని అఖండ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీకి రూ.6.5 కోట్లు టోపీ పెట్టాడు. ఈ కేసులో మంగళవారం శ్రవణ్‌రావును విచారించిన సీసీఎస్ పోలీసులు, ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని మిథిలా నగర్‌లో ఉన్న అఖండ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ ప్రధాన కార్యాలయానికి ఇన్‌రిథ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న శ్రవణ్ రావు 2022 జూన్‌లో వెళ్లారు. అక్కడ అఖండ డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణను కలిశారు. బెంగళూరులోని సండూరులో ఉన్న ఎకోర్ ఇండస్ట్రీస్ తన ఆధీనంలోనే ఉందని, దానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లు బురిడీ కొట్టించారు. ఎకోర్ ఇండస్ట్రీస్ నుంచి ఇనుప ఖనిజం (ముడి ఇనుము) కొనుగోలు చేస్తే టన్నుకు రూ.300 లాభం ఉంటుందని నమ్మబలికారు. శ్రవణ్ మాటలు నమ్మిన అఖండ సంస్థ.. విడతల వారీగా రూ. కోట్ల విలువైన ఖనిజాన్ని కొనుగోలు చేసింది. తన అకౌంటెంట్ ద్వారా మెయిల్ చేయించి అఖండ నుంచి రూ. 6.5 కోట్ల పై చిలుకు డబ్బును తన ఖాతాలకు మళ్లించుకున్నారు. ఆ తర్వాత సరుకు సరఫరా చేయలేదు. దీనిపై 2024 జూలైలో అఖండ సంస్థ ప్రతినిధులు ఆరా తీయగా.. శ్రవణ్‌రావుతో పాటు ఎకోర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఉమా మహేశ్వర్‌రెడ్డి, శ్రవణ్‌రావు అనుచరుడు వేదమూర్తితో కలిసి అఖండ సంస్థకు రూ. 6.5 కోట్లకు పైగా టోపీ పెట్టినట్లు గుర్తించారు.
Also Read: రీన్యూ ఎనర్జీ కాంప్లెక్స్.. 16న లోకేష్ శంకుస్థాపన
ఈ విషయమై వారిని నిలదీయగా.. శ్రవణ్ రావు విదేశాలకు వెళ్లారని, ఆయన భార్య స్వాతిరావు కంపెనీ బాగోగులు చూస్తున్నారని చెప్పారు. దాంతో బాధితులు ఆమెను కలవగా.. ఆ డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చారు. ముందుగా రూ.50 లక్షలు అఖండ సంస్థ ఖాతాకు బదిలీ చేశారు. ఆ తర్వాత మిగిలిన డబ్బు గురించి మాట్లాడటానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావు విదేశాల నుంచి వచ్చిన విషయం తెలుసుకున్న బాధితులు గత నెల 24న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రవణ్‌రావుకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సీసీఎస్‌లో శ్రవణ్‌రావును విచారించారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పాక్ వక్రబుద్ధి.. సాంబ సెక్టార్‌లోకి డ్రోన్లు..
వరంగల్ పర్యటనకు మిస్ వరల్డ్ కంటెంట్స్..
For More AP News and Telugu News
Updated Date - May 14 , 2025 | 01:27 PM