Minister Lokesh: రీన్యూ ఎనర్జీ కాంప్లెక్స్.. 16న లోకేష్ శంకుస్థాపన
ABN , Publish Date - May 14 , 2025 | 12:38 PM
Minister Lokesh: భారతదేశంలో ప్రముఖ గ్రీన్ ఎనర్జీ కంపెనీ.. రీన్యూ పవర్ ఆంధ్రప్రదేశ్‌లో రూ. 22వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌ను స్థాపించనుంది.
అమరావతి: రూ. 22 వేల కోట్లతో అనంతపురం జిల్లాలో రీన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ (Renewable Energy Complex) నిర్మాణం కానుంది. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు 16న (శుక్రవారం) మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) శంకుస్థాపన (Inauguration) చేయనున్నారు. గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో నిర్మాణం జరగనుంది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి లోకేష్, రీన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య చర్చలు ఫలించాయి. కాగా ఆరేళ్ల తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రీన్యూ పవర్ ముందుకు వచ్చింది.
ఈ ప్రాజెక్టు తొలిదశలో రీన్యూ సంస్థ 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లపై రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. 2019కి ముందు 777 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ పునరుత్పాదక ఇంధనరంగంలో ప్రధాన పెట్టుబడిదారుగా రీన్యూ పవర్ ఉంది. వచ్చే ఐదేళ్లలో 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడం లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పెట్టుకున్నారు.
Also Read: పాక్ వక్రబుద్ధి.. సాంబ సెక్టార్‌లోకి డ్రోన్లు..
ఈ వార్తలు కూడా చదవండి..
వరంగల్ పర్యటనకు మిస్ వరల్డ్ కంటెంట్స్..
YCP: మరో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా
For More AP News and Telugu News