ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్

ABN, Publish Date - Jun 07 , 2025 | 02:35 PM

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Telangana Cabinet Expansion

హైదరాబాద్, జూన్ 7: గత కొన్ని నెలలుగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై (Telangana Cabinet Expansion) కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు (ఆదివారం) తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగనుంది. మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 12 మంది కేబినెట్‌‌లో మంత్రులుగా ఉన్నారు. మరో ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఏడాదిన్నరకు పైగా కేబినెట్ విస్తరణ జరగలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగింది. తమకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానం చుట్టూ నేతలు తిరుగుతున్న పరిస్థితి.


ఇటీవల మీనాక్షీ నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన తర్వాత ఆశావాహులంతా కూడా ఆమె కలిసి మంత్రి పదవి కోసం వినతులు చేశారు. కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్ నేతలు తమకు అవకాశం కల్పించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు ఇచ్చింది. రేపు మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనిపై ఈరోజు రాజ్‌భవన్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా రాజ్‌భవన్ వర్గాలను సీఎం కోరినట్లు తెలుస్తోంది. రేపు కేబినెట్ విస్తరణలో ముగ్గురికి చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ఈ ముగ్గురు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.


మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు అనేక మంది పోటీ పడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నేతలు, రెడ్డి సామాజిక వర్గం నేతలు మంత్రి వర్గంలో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎస్సీ సామాజికవర్గానికి కేబినెట్‌లో ప్రాధాన్యత లేదు. ముదిరాజ్‌‌లకు కచ్చితంగా అవకాశం ఇస్తానని గత ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మైనార్టీలకు కూడా కేబినెట్‌లో చోటు లభించలేదు. ఈ క్రమంలో రేపటి కేబినెట్ విస్తరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చోటు లభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేవంత్ కొత్త టీం ఎవరనేది రేపు (మే 8) తెలిసే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

ఏపీకి గూగుల్.. స్థలం పరిశీలన పూర్తి

ఏఐజీ హాస్పటల్‌లో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 03:03 PM