ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా.. అంటూ సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

ABN, Publish Date - Feb 01 , 2025 | 07:53 PM

KTR: కేసీఆర్ దెబ్బ ఎట్లా ఉంటుందో.. మీ పాత గురువును అడుగు.. అలాగే సోనియా గాందీలను అడుగాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కేసీఆర్ అంటే హిస్టరీ.. రేవంత్ రెడ్డి అంటే లాటరీ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిననోడు రేవంత్ రెడ్డి అంటూ అభివర్ణించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 01: తమ పార్టీ అధ్యక్షడు, మాజీ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ సీఎం రేవంత్ ఏం పీకలేరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్.. ఒక్కటి గుర్తు పెట్టుకో... కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా కాంగ్రెస్ తాత జేజెమ్మలు దిగివచ్చినా మరిపించలేరన్నారు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. రాసి పెట్టుకోండి రేవంత్‌ను ఓడ గొట్టేది పట్నం నరేందర్ రెడ్డి మాత్రమేనని ఆయన జోస్యం చెప్పారు.

అంబేద్కర్ నేర్పించిన బోధించి.. సమీకరించు.. పోరాడు అనే గొప్ప సూత్రాన్ని కేసీఆర్ ఒంట పట్టించుకున్నారని గుర్తు చేశారు. అలా ప్రజలను సమీకరించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి... అహింసా విధానంలో బీఆర్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని వివరించారు. అయితే మన దేశంలో అంబేద్కర్‌ను కొన్ని వర్గాలకు పరిమిత చేసే ప్రయత్నం చేయడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన దార్శనికతను హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ తదితర విశ్వవిద్యాలయాలు గుర్తించాయని చెప్పారు.


తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు కేసీఆర్ చంటిపిల్లలా సాదుకున్నారని తెలిపారు. అలాగే పరిపాలన వికేంద్రీకరణ ఫలాలు.. ప్రజలకు అందించాలని ఆయన పరితపించారన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా కేసీఆర్ నడిపించారని చెప్పారు. ఇక దేశ చరిత్రలో రైతు బంధు లాంటి పథకం ఇప్పటి వరకు రాలేదన్నారు.

Also Read: ఇది సీఎం చంద్రబాబు పవర్..


రైతు బంధు పథకం రూపంలో రైతులకు రూ. 73 వేల కోట్లు కేసీఆర్ వేశారని గుర్తు చేశారు. అయితే జనవరి 26వ తేదీ అనంతరం రైతు భరోసా టకీ టకీ మని వస్తుందని సీఎం చెప్పినా.. రాష్ట్రంలో ఎవరికీ ఇంత వరకు పడలేదన్నారు. టకీ టకీమని బంగారం పడటం లేదు.. కానీ సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే మాత్రం తిట్ల పురాణమే వస్తుందంటూ వ్యంగ్యంగా అన్నారు.

Also Read: పథకాలకు భారీ కేటాయింపులు.. అవి ఎంతెంత అంటే ?


తాము అంతకంటే ఎక్కువ తిట్టగలమని.. కానీ తమకు సంస్కారం ఉందన్నారు. 71 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రిని సంస్కారం లేని రేవంత్ రెడ్డి.. కట్టె పట్టుకుని నిలబడు అని అంటున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ ఆయన నిలబడుడే కాదు.. నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని సైతం నిలబెట్టారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దానిని.. దేశం ముందు సమున్నతంగా కేసీఆర్ నిలబెట్టారని వివరించారు.

Also Read: మళ్లీ ఎన్‌కౌంటర్: భారీగా మావోయిస్టులు హతం


కేసీఆర్ దెబ్బ ఎట్లా ఉంటుందో.. మీ పాత గురువును అడుగు.. అలాగే సోనియా గాందీలను అడుగాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కేసీఆర్ అంటే హిస్టరీ.. రేవంత్ రెడ్డి అంటే లాటరీ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిననోడు రేవంత్ రెడ్డి అంటూ అభివర్ణించారు. అదృష్టం కొద్ది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగడం లేదని.. ఆయన కంటే ముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారన్నారు.

Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ


రాష్ట్రంలో ఒక్కరికైనా అంబేద్కర్ అభయ హస్తం కింద రూ.12 లక్షల నిధులు మంజూరు చేశారా? అని ప్రశ్నించారు. బీసీలకు ఏడాదికి ఇస్తానన్న రూ. 20 వేల కోట్లు ఎక్కడా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఇక తిట్ల పురాణం బంద్ చేయ్ అని సూచించారు. నీ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోందంటూ ఎద్దేవా చేశారు. రేవంత్‌కు ముందుంది ఇక సినిమానే అని పేర్కొ్న్నారు.


అసెంబ్లీకి రా అని కేసీఆర్‌ని అనడం కాదు.... దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా లగచర్లకు రా నీ సంగతేమిటో ప్రజలు చెబుతారన్నారు. లగచర్ల రైతులు, నల్లగొండ రైతుల కోసం ధర్నా చేస్తామంటే అనుమతి ఇవ్వనివ్వడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. త్వరలోనే తాము కొడంగల్‌కు వెళ్లి.. మీటింగ్ పెడతామని సవాల్ విసిరారు. తమ ప్రభుత్వ హయాంలో రేవంత్ రాష్ట్రమంతా స్వేచ్ఛగా తిరిగి... తమని తిట్టాడని గుర్తు చేశారు.


ఇక లగచర్ల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన పలువురిని ఈ సందర్భంగా కేటీఆర్ సన్మానించారు. అయితే రైతు భరోసా, రుణమాపీ విషయంలో రేవంత్ సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నాడంటూ మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో మొదట 49 వేలు కావాలని చెప్పిన రేవంత్.. రూ.12 కోట్లే మాఫీ చేశాడన్నారు. రాష్ట్రంలో చారానా కూడా రుణమాఫీ కాలేదని స్పష్టం చేశారు. రేవంత్ నువ్వు రాష్ట్రంలో ఎక్కడికి రమ్మన్న వస్తా... నీ సొంతూరు కొండారెడ్డిపల్లి రమ్మన్నా వస్తాను.. లేదంటే కొడంగల్ రమ్మన్నా వస్తానంటూ బహిరంగ సవాల్ విసిరారు.


రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా వంద శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా కాదు రాజకీయ సన్యాస్యం తీసుకుంటానంటూ సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు. సీఎం హోదాలో ఇన్ని అబద్దాలు ఆడటం పదవికి తగదన్నారు. రాష్ట్రంలో రైతు కూలీలు అందరికి రూ.12 వేలు ఇచ్చామనడం పచ్చి అబద్దన్నారరు. అనుముల రేవంత్ రెడ్డి కాదు ఇకపై ఆయన పేరు అబద్దాల రేవంత్ రెడ్డి అని అభివర్ణించారు. ఆయన నోట్లోంచి అబద్దం తప్ప నిజం రాదని స్పష్టం చేశారు.


రైతు భరోసా ఎప్పుడు వస్తుందో తెలియదన్నారు. రైతు బంధు కోసం రూ. 7,600 కోట్లు ఖజానాలో ఉంచితే.. నాడు రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి ఆపించారని గుర్తు చేశారు. ఆరు నెలల ఆపి పార్లమెంట్ ఎన్నికలపుడు ఆ నగదు ఖాతాల్లో వేశారన్నారు. సంవత్సర కాలానికి ప్రతీ ఎకరానికి రైతుకు రూ.17,500 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడని వివరించారు. ఓట్లప్పుడే కాంగ్రెస్ నేతలు దొరుకుతారని.. అవి అయిపోతే వారు దొరకరని ఎద్దేవా చేశారు.


సర్పంచ్ ఎన్నికలప్పుడు ఉళ్లకు వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలంటూ ప్రజలకు కేటీఆర్ సూచించారు. ప్రతీ మహిళకు రేవంత్ రూ. 30 వేలు బాకీ ఉన్నాడని కేటీఆర్ ఈ సందర్భంగా వివరించారు. రేవంత్ రెడ్డిది చిన్న గుణమన్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీస్తామన్నారు. కొడంగల్ గిరిజనుడికి జైల్లో గుండెనొప్పి వస్తే బేడీలు వేసిన ఘనుడు రేవంత్ రెడ్డి అని అభివర్ణించారు.

For Telangana News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 07:53 PM