Share News

chhattisgarhs: మళ్లీ ఎన్‌కౌంటర్: భారీగా మావోయిస్టులు హతం

ABN , Publish Date - Feb 01 , 2025 | 03:59 PM

chhattisgarhs Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మరణించారు. వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భద్రతా దళాలు వెల్లడించాయి.

chhattisgarhs: మళ్లీ ఎన్‌కౌంటర్: భారీగా మావోయిస్టులు హతం

రాయ్‌పూర్, ఫిబ్రవరి 01: ఛత్తీస్‌గఢ్‌‌లో మళ్లీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకొంది. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భద్రతా దళాలు వెల్లడించాయి. మరోవైపు మావోయిస్టుల కోసం భద్రతా దళాలు చేపట్టిన కూబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

గంగలూరు పోలీస్ స్టేషన్ పరధిలో మావోయిస్టులు సమావేశమయ్యారంటూ భద్రతా దళాలకు శనివారం ఉదయం సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతానికి చేరుకొన్న భద్రత దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఆ క్రమంలో వారికి మావోయిస్టులు ఎదురు పడ్డారు. దీంతో వారు.. భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. ఆ వెంటనే భద్రతా దళాలు స్పందించి.. ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో ఇరువైపులా హోరా హోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగవచ్చని భద్రతా దళాలు స్పష్టం చేస్తున్నాయి.


ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే పలు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఆ యా ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మరణించిన విషయం విధితమే. 2026, మార్చి మాసాంతానికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే దాదాపుగా మావోయిస్టులు తుడుచు పెట్టుకు పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మాత్రం వారి జాడ ఇంకా ఉంది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. అందులోభాగంగా మావోయిస్టులు లొంగి పోయి జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ


ఇక కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా మావోయిస్టుల బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీస్ స్టేషన్‌లో సీఎం దేవేంద్ర ఫడణవీస్ సమక్షంలో పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సీనియర్ మావోయిస్టు చలపతి మరణించారు. ఆయనపై రూ. కోటి రివార్డు ఉన్న సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతకు భద్రత దళాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తున్నాయి. అందులోభాగంగా తరచూ ఎన్‌కౌంటర్లు చోటు చేసుకొంటున్నాయి.

For National News And Telugu News

Updated Date - Dec 04 , 2025 | 04:01 PM