Share News

Union Budget 2025 - 26: పథకాలకు భారీ కేటాయింపులు.. అవి ఎంతెంత అంటే ?

ABN , Publish Date - Feb 01 , 2025 | 04:16 PM

Union Budget 2025 - 26: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్రం అందించే పలు పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

Union Budget 2025 - 26: పథకాలకు భారీ కేటాయింపులు.. అవి ఎంతెంత అంటే ?

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 01: 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అంటే ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 150 పథకాలకు బడ్జెట్‌లో కీలక కేటాయింపులు చేసింది. ఆ కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.

  • గ్రామీణ ఉపాధి హామీకి రూ. 86 వేల కోట్లు.

  • ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజనకు రూ.19 వేల కోట్లు.

  • జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌కు రూ.19 వేల కోట్లు

  • వాటర్‌ షెడ్‌ అభివృద్ధికి రూ. 2,505 కోట్లు

  • కృషి వికాస యోజనకు రూ. 8,500 కోట్లు

  • ఆయుష్‌ మిషన్‌కు రూ.1,275 కోట్లు

  • సమగ్ర శిక్షా యోజనకు రూ. 41,250 కోట్లు

  • పోషణ్ శక్తికి రూ.12,500 కోట్లు

  • ప్రధాన మంత్రి స్కూల్‌ రైజింగ్‌కి రూ. 7,500 కోట్లు

  • ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.30 వేల కోట్లు

  • ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయలకు రూ. 7 వేల కోట్లు

  • ఆయుష్మాన్‌ భారత్‌కి రూ.9,600 కోట్లు


  • పోలీసు ఆధునీకరణకు రూ.4,069 కోట్లు

  • ప్రధాని ఆవాస యోజన (అర్బన్‌) రూ.19,794 కోట్లు

  • ప్రధాని ఆవాస యోజన (గ్రామీణ) రూ.54,832 కోట్లు

  • అమృత్‌కి రూ.10 వేల కోట్లు

  • స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (అర్బన్‌) రూ. 5 వేల కోట్లు

  • స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) రూ.7,192 కోట్లు

  • అర్బన్‌ ఛాలంజ్‌ ఫండ్‌ రూ.10 వేల కోట్లు

    Also Read: మళ్లీ ఎన్‌కౌంటర్: భారీగా మావోయిస్టులు హతం


  • పీఎం కృషీ సించాయి యోజన రూ. 8,260 కోట్లు

  • నదుల అనుసంధానానికి రూ. 2,400 కోట్లు

  • పోలవరం ప్రాజక్టుకు రూ. 5,936 కోట్లు

  • జలజీవన్‌ మిషన్‌ (గ్రామీణ తాగునీటి) రూ. 67 వేల కోట్లు

  • పన్ను మినహాయింపుల కోసం రూ. 22,600 కోట్లు

  • అంగన్‌వాడీ రూ. 21,960

  • పంటల భీమా రూ.12,242 కోట్లు

  • పీఎం ఆశా రూ. 6,941 కోట్లు

  • పీఎం కిసాన్‌ రూ. 63,500 కోట్లు

  • పత్తి టెక్నాలజీ మిషన్‌ రూ.500 కోట్లు

    Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ


  • పప్పు ధాన్యాల మిషన్‌ రూ. వెయ్యి కోట్లు

  • పండ్లు, కూరగాయల మిషన్‌ రూ. 500 కోట్లు

  • హైబ్రిడ్‌ విత్తనాల మిషన్‌ రూ. 100 కోట్లు

  • మఖనా బోర్డుకు రూ.100 కోట్లు

  • యూరియా సబ్సిడీ రూ.1,18,900 కోట్లు

  • పోషకాహార సబ్సిడీ రూ. 49 వేల కోట్లు

  • కొత్త పారిశ్రామిక పార్క్‌లకు రూ. 2,500 కోట్లు

  • టెలికం మౌలిక సదుపాయలకు రూ. 28,400 కోట్లు

  • గరీబ్‌ కళ్యాణ్‌ యోజన రూ. 2 లక్షల 3 వేల కోట్లు

  • రక్షణ పరిశోధనలకు రూ.14,924 కోట్లు

  • విమానాలు, ఏరో ఇంజన్లకు రూ. 48,614 కోట్లు


  • రక్షణ నిర్మాణాలకు రూ. 11,452 కోట్లు

  • నావెల్‌ ఫ్లీట్‌ రూ. 24,391

  • సెమీ కండక్టర్స్‌ వ్యవస్థ ఏర్పాటు రూ. 7 వేల కోట్లు

  • ఇండియా ఎఐ మిషన్‌ రూ. 2 వేల కోట్లు

  • మెట్రో ప్రాజక్టులు రూ.31,239 కోట్లు

  • పోలీసు మౌలిక వసతులకు రూ. 4,379

  • కొత్త ఉద్యోగాల సృష్టికి రూ. 20 వేల కోట్లు

  • కుసుం రూ. 2,600 కోట్లు


  • సూర్య ఘర్‌ రూ. 20 వేల కోట్లు

  • పేదలకు ఎల్‌పిజి కనెక్షన్లకు రూ. 9,100 కోట్లు

  • కొత్త రైల్వే లైన్లకు రూ. 32,235 కోట్లు

  • డబ్లింగ్‌కి రూ. 32 వేల కోట్లు

  • రోలింగ్‌ స్టాక్‌ రూ. 45,530 కోట్లు

  • జాతీయ రహదారులకు రూ. 1, 70, 266 కోట్లు

  • మంత్రిత్వ శాఖ ద్వారా రహదారులకు రూ.1,16,292 కోట్లు

  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పరిశోధనలకు రూ.20 వేల కోట్లు

  • ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌ రూ. 7,089

  • ఖేలో ఇండియా రూ. 1000 కోట్లు

    For National News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 04:36 PM