Telangana Politics: కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం పక్కా.. బీజేపీ నేత సంచలన కామెంట్స్
ABN, Publish Date - May 14 , 2025 | 04:48 PM
Telangana Politics: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు సంబంధించి బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం కాబోతోందని కామెంట్స్ చేశారు.
హైదరాబాద్, మే 14: బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య డీల్ కుదిరిందంటూ సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్థానంలో కేసీఆర్ (KCR) సీఎం అవుతారన్నారు. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం కాబోతోందన్నారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం పక్కా అని తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తారన్న మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం ఖాయమంటూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది.
గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకటే అంటూ చాలా సార్లు బీజేపీ ఆరోపణలు చేసింది. బీజేపీకి కాంగ్రెస్‌కు మధ్య అంతర్గత ఒప్పందం ఉందంటూ బీఆర్‌ఎస్ పార్టీ కూడా ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కొంత బలాన్ని చేకూర్చినట్లైంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో పాలన స్తంభించింది. అనుకున్న స్థాయిలో వెల్ఫేర్ స్కీమ్స్ ముందుకు తీసుకువెళ్లడం లేదు. తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోయిందని, తెలంగాణలో పూర్తి స్థాయి వెల్ఫేర్ స్కీమ్స్‌ను ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేదని, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని, ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సిందిగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలను విశ్లేషించుకుని ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పాలించే దమ్ము ధైర్యం లేనప్పుడు వదిలేస్తే తాము అధికారంలోకి వస్తామంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు కూడా. ఈ నేపథ్యంలో ఇకపై తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలోకి రాబోతోందని, ఈ మేరకు విలీనం చేయాలని బీఆర్‌ఎస్ నాయకత్వం అంతా కూడా డిసైడ్ అయ్యిందని, అందుకు సంబంధించిన తేదీలు కూడా ఖరారైందంటూ బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఇవి కూడా చదవండి
AP Liquor Scam: గోవిందప్పను కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు.. అంతలోనే
CAIT Letter To Piyush Goyal: ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫారాలపై పాక్ జెండాలు.. సీఏఐటీ అభ్యంతరం
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 14 , 2025 | 04:48 PM