ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Etela Rajender: మెడపై తుపాకీ పెట్టినా నిజాలే చెబుతా.. కమిషన్ విచారణపై ఈటెల

ABN, Publish Date - Jun 06 , 2025 | 01:46 PM

Etela Rajender: 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా వాల్యూతో ఉన్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశానన్నారు. తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమని చెప్పారు.

MP Etela Rajender

హైదరాబాద్, జూన్ 6: కాళేశ్వరం రిపోర్ట్ (Kaleshwaram Report) త్వరగా బయట పెట్టాలని.. రిపోర్ట్ విషయంలో తాత్సారం చేస్తే వదిలే ప్రసక్తి లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ (BJP MP Etela Rajender) అన్నారు. కాళేశ్వరం విచారణ అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. కంఠంపై తుపాకీ పెట్టినా ఈటెల నిజమే మాట్లాడుతారు అని స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డిజైన్లు, నిర్మాణంతో సంబంధం ఉందా అని కమిషన్ అడిగిందని.. తనకేం సంబంధం లేదని చెప్పానన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్‌పై అధికారం ఉండేదా అని అడగ్గా.. తనకు ఎలాంటి అధికారం లేదని చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం నిర్మాణం క్వాలిటీ గురించి ఇంజనీర్లు చూసుకోవాలని.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశారన్నారు.


మంత్రివర్గ ఉపసంఘం, సీడబ్ల్యూసీ రిపోర్ట్ ఆర్థిక శాఖ ముందు పెట్టారని తెలిపారు. నిజాయితీగా ఉండాలని కోరే పార్టీ బీజేపీ అని ఎంపీ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ (Former CM KCR) అని ఆయనే చెప్పుకున్నారని.. ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఆనాటి ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై నిర్ణయం తీసుకుంది కేసీఆర్ అని.. అప్పుడు ఆయనే బాస్ అన్నారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా వాల్యూతో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశానన్నారు. తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమని చెప్పారు. 2006లో తుమ్మిడి హేట్టి రూ.16 వేలు ఉంటే 2015లో రూ.38 వేల కోట్లకు పెరిగిందన్నారు. తుమ్మిడి హేట్టి దగ్గర కట్టాలని అనుకున్నా మహారాష్ట్ర ఒప్పుకోలేదన్నారు. మూడు బ్యారేజీలు సీడబ్ల్యూసీ రిపోర్ట్, టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో కట్టారన్నారు. మూడు బ్యారేజీలు సబ్ కమిటీ, టెక్నికల్ కమిటీ రిపోర్టు ఆధారంగా కట్టారని వెల్లడించారు.


మొదట రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయితే.. రైతుల డిమాండ్ మేరకు రూ.82 వేల కోట్లకు పోయిందన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం పెట్టారని కమిషన్ ప్రశ్నిస్తే.. కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని చెప్పినట్లు తెలిపారు. ‘మా బతుకులో నిబద్ధతతో ఉంది... నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా. ఎవరు పిలిచినా ఎక్కడైనా నిజాలే చెప్తా. కొందరు బట్టకాల్చి మీదేస్తే నాకేమీ కాదు’ అని అన్నారు. మూడు బ్యారేజీలు రూ.10వేల కోట్ల లోపే అని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌ను త్వరగా బయటపెట్టాలని.. నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం తేల్చాలని ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి

ముదిరిన వివాదం.. శాతవాహన కాలేజ్ నేలమట్టం

అంతా నిజమే చెబుతా.. ఈటెలతో కమిషన్ ప్రమాణం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 06 , 2025 | 03:43 PM