Chamala Kiran Kumar Reddy: స్వర్గానికా.. నరకానికా.. కేసీఆర్ సీఎం: ఎంపీ చామల
ABN, Publish Date - Jun 02 , 2025 | 04:59 PM
బీఆర్ఎస్ నేతలతోపాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు చేస్తున్న విమర్శలు ఈ సందర్భంగా ఆయన తిప్పికొట్టారు.
హైదరాబాద్, జూన్ 02: మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈటల రాజేందర్ ఇంటి లోపల ఈటల రాజేందర్ రెడ్డి అని.. గేటు బయటకు రాగానే ఓబీసీ నాయకుడు అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. సోమవారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ వదిలి పెట్టానని ఈటల రాజేందర్ చెబుతున్నారని గుర్తు చేశారు. కానీ ఆయన 24 గంటలు బీఆర్ఎస్ గురించే మాట్లాడుతున్నారని చెప్పారు. ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్న విషయం ఆ పార్టీ నాయకులే గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కన్ఫ్యూజ్ పొలిటీషన్ ఈటల రాజేందర్ అని ఆయన అభివర్ణించారు. లెఫ్ట్ వింగ్‌లో ఉన్న ఈటల రాజేందర్.. పార్టీ అధ్యక్ష పదవి కోసం రైట్ వింగ్‌లోకి వెళ్లారని గుర్తు చేశారు. ఏ పదవి రాకపోవడంతో.. తమ పార్టీ నేతలపై ఈటల రాజేందర్ ప్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారన్నారు. తమ పార్టీ నేతలను విమర్శించ వద్దని ఈ సందర్బంగా ఈటలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్‌యూఐ నుంచి పీసీసీ అధ్యక్షుడి అయ్యారన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది.. బీఆర్ఎస్ పార్టీ అని మాజీ మంత్రి హరీశ్ రావు అంటున్నారని.. కానీ తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. నాడు సోనియాగాంధీ ఈ రాష్ట్రం ఇవ్వబట్టే నేడు ఆవిర్భావ సభలు జరుగుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. ఇంగ్లాడ్ మిస్ మ్యాగీని సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్లు ఇబ్బంది పెట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు అంటున్నారని చెప్పారు. మీ వద్ద వీడియో ఫుటేజ్ ఉంటే బయట పెట్టండంటూ బీఆర్ఎస్ నేతలను ఆయన డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వాన్ని బద్నం చేయడానికి మిస్ ఇంగ్లాండ్ మ్యాగీతో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు అలా మాట్లాడించారేమో అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు అనారోగ్యం కారణంగా ఆమె ఇంగ్లాడ్ వెళ్ల వలసి వచ్చిందని చెబుతున్నారన్నారు.
దేశంలోనే కేసీఆర్ త్యాగాలు చేసిన నేతగా హరీశ్ రావు అభివర్ణిస్తున్నారని చెప్పారు. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని అధికారాన్ని పదేళ్లు అనుభవించారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆయన మండిపడ్డారు. అధికారుల లిస్ట్.. రెడ్ బుక్‌లో నమోదు చేస్తానని హరీష్ రావు అంటున్నాడన్నారు. అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేయాలనే విషయంలో హరీష్ రావు రోల్ మోడల్ అని విమర్శించారు.
సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకే కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి.. ఎక్కడ నుంచి అయినా సమీక్ష చేస్తారని స్పష్టం చేశారు. అవసరమైతే ములుగు అడవుల్లోనైన ఆయన సమీక్ష చేస్తారన్నారు. . మీరు ప్రగతి భవన్ అని ప్రగతి లేని బిల్డింగ్ కడితే తాము అధికారంలోకి రాగానే గడీలు పగలగొట్టామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహాత్ముడి పేరు పదే పదే కేటీఆర్ వాడుతున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ మూడేళ్లకే ముఖ్యమంత్రి అవుతారని కేటిఆర్ అంటున్నారని.. ఇంతకీ కేసీఆర్ స్వర్గానికి ముఖ్యమంత్రి అవుతాడా ? లేక నరకానికి ముఖ్యమంత్రి అవుతాడా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. మళ్ళీ బిడ్డ తెలంగాణ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాడు. కానీ గత పడేండ్లలో బిడ్డ తెలంగాణ గజగజ వణికి పోతుందన్నారు. అమెరికాలో నల్ల ధనాన్ని ఖర్చు పెడితే మీ నాయన అధికారంలోకి రాడంటూ కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చురకలంటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 02 , 2025 | 05:02 PM