ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నిర్మానుష్య ప్రదేశంలో బ్యాగ్.. తెరిచి చూస్తే షాక్

ABN, Publish Date - Jun 04 , 2025 | 03:35 PM

Hyderabad: నగరంలోని బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో ఓ ట్రావెల్‌ బ్యాగ్‌ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని బ్యాగ్‌ను తెరిచి చూసి షాక్‌ అయ్యారు.

Hyderabad

హైదరాబాద్, జూన్ 4: నగరంలోని బాచుపల్లి (Bachupally) మహిళ మృతదేహం కలకలం రేపుతోంది. ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. బ్యాగులో కుళ్లి స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. అసలు ఆ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి తీసుకువచ్చారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సూట్‌కేస్‌లో మహిళ మృతదేహాన్ని వదిలి వెళ్లారు. బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.


వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బ్యాగ్‌ను పరిశీలించగా.. మహిళ డెడ్‌బాడీ బయటపడింది. మృతురాలు సుమారు 25 నుంచి 35 సంవత్సరాలు ఉండి, మెరూన్ కలర్ పంజా డ్రెస్‌తో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.


దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల ముందు యువతిని చంపిన తర్వాత ఓ పథకం ప్రకారమే నిర్మానుష్య ప్రదేశంలో పడేసినట్లు తెలుస్తోంది. బాల్‌నగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పడి.. మృతురాలి ఆచూకీ, హత్య చేసిన వారి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. మహిళ ఎవరు, ఏంటి అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళ ఎవరనేది గుర్తిస్తే నిందితులు ఎవరనేది దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇద్దరు వ్యక్తులు అనునాస్పదంగా ఆ నిర్మానుష్య ప్రదేశంలో తిరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్‌ను ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి

ఇథనాల్ ఫ్యాక్టరీపై వ్యతిరేకత.. ప్రజల్లో ఆగ్రహావేశం.. వాహనాలకు నిప్పు

మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 04 , 2025 | 03:45 PM