ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌ వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు!

ABN, Publish Date - May 23 , 2025 | 04:25 AM

హైదరాబాద్‌ నుంచి డిండి, మన్ననూరు, శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రయాణికులకు తీపికబురు.

  • రేడియల్‌ రోడ్డు ముగిసే ఆమనగల్‌ నుంచి మన్ననూరు దాకా

  • నాలుగు వరుసలతో రహదారి నిర్మాణం

  • సీఎం సూచనలతో 3 ప్రతిపాదనలను

  • సిద్ధం చేసిన ఎన్‌హెచ్‌ఏఐ

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నుంచి డిండి, మన్ననూరు, శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రయాణికులకు తీపికబురు. ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌), రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)లను కలుపుతూ కొంగర్‌కలాన్‌ నుంచి ఆమనగల్‌ వరకు 41.5 కి.మీ మేర నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డుకు కొనసాగింపుగా ప్రతిపాదిత (జాతీయ రహదారి 765) శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం ప్రార ంభమయ్యే ప్రాంతం వరకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే అందుబాటులోకి రానుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం పూర్తయితే ఏపీకి వెళ్లడానికి ప్రయాణ దూరం తగ్గనుంది. ప్రయాణ సమయమూ ఆదా కానుంది.. కొంగర్‌కలాన్‌ నుంచి ఆమనగల్‌ వరకు హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీ సీఎల్‌), హెచ్‌ఎండీఏ పరిధిలో గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డును నిర్మిస్తున్నారు.


ఆమనగల్‌ దగ్గర ముగిసే ఈ రేడియల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డును కొనసాగిస్తూ శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌ వరకు నాలుగు వరుసల విధానంలో గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మూడు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వాటిలో ఒకదానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయగానే కేంద్రానికి కూడా నివేదిక సమర్పించి, అనుమతి వచ్చాక రహదారి పనులను ప్రారంభించనున్నారు. కాగా హైదరాబాద్‌ నుంచి డిండి వరకు రోజుకు సగటున 10వేలకు పైగా వాహనాలు ప్రయాణం చేస్తున్నట్టు నివేదికలో పొందుపర్చారు. ఇప్పుడు ఆమనగల్‌ నుంచి మన్ననూర్‌ వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మించాలని సీఎం సూచనల నేపథ్యంలో సిద్ధం చేసిన మూడు ప్రతిపాదనల్లో రహదారి అలైన్‌మెంట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. మొదటి ప్రతిపాదనలో 20 గ్రామాలు, రెండో ప్రతిపాదనలో 11 గ్రామాలున్నాయి. మూడో ప్రతిపాదనలో ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లితో పాటు మొత్తం 15 గ్రామాల మీదుగా మన్ననూర్‌ వరకు రహదారి అలైన్‌మెంట్‌ను ఉంది.


మూడు ప్రతిపాదనలు ఇవే

ఆప్షన్‌-1: ఇది ప్రస్తుత రోడ్డు 75కి.మీ ఉంది. గ్రీన్‌ఫీల్డ్‌ విధానంలో 6.9కి.మీ, బ్రౌన్‌ఫీల్డ్‌ విధానంలో 68.15కి.మీ నిర్మాణం చేపట్టాలి. ఆమనగల్‌, మేడిగడ్డ, పెద్దాపర్‌, చెర్కూర్‌, వెల్దండ, కోట్ర, జయప్రకాశ్‌నగర్‌, తండ్రా, వంగూర్‌ గేట్‌, సర్వారెడ్డిపల్లి, కోనేటిపురం, తిరుమలగిరి, డిండి, ఈరట్వాన్‌పల్లి, వెల్టూరు, అయ్య వారిపల్లి, చెన్నారంసబ క్‌, రాయ్‌చేడు, హజిపూర్‌, తానాపూర్‌, బ్రాహ్మణపల్లి, మన్ననూర్‌ గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం కానుందని తెలిపారు.

ఆప్షన్‌-2: ఈ విధానంలో 59కి.మీ రోడ్డు ఉంటుంది. గ్రీన్‌ఫీల్డ్‌ విధానంలో 46.7కి.మీ, బ్రౌన్‌ఫీల్డ్‌ విధానంలో 12.65కి.మీ మేర నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఆమనగల్‌, తిమ్మాయిపల్లి, దొంతులగుట్ట తండా, సర్వారెడ్డిపల్లి, కో నెట్లపురం, తిరుమలగిరి, సింగవారం, కొర్రాతండా, చెదురుబావితండా మీదుగా మన్ననూర్‌ వరకు ఈ రోడ్డు ఉండనుంది.

ఆప్షన్‌-3: ఇది మొత్తం 72.35 కి.మీ ఉండనుంది. నిర్మాణానికి రూ.1,822 కోట్ల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఆమనగల్‌, మేడిగడ్డ, నారా యణపూర్‌, చెర్కూర్‌, చొకన్నపల్లి, వెల్దండ, కొండారెడ్డిపల్లి, వంగూర్‌, తిప్పారెడ్డిపల్లి, డిండి, వెల్టూర్‌, చెన్నారంసబక్‌, హజిపూర్‌, నడింపల్లి మీదుగా మన్ననూర్‌ వరకు రోడ్డు ఉండనుంది.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 23 , 2025 | 04:25 AM