ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Temperatures: మార్నింగ్‌ నుంచే మాడుతోంది..

ABN, Publish Date - Apr 23 , 2025 | 07:20 AM

నగరంలో.. పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. మంగళవారం 42 డిగ్రీల వరకు చేరడంతో బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. సాయంత్రం పొద్దుపోయే సమయంలో వాతావరణం మారిపోతోంది. అలాగే వర్షం కూడా కురిసింది. ఒక విభిన్న వాతావరణం నగరంలో చోటుచేసుకుంటోంది.

- 42 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రతలు

- మంటపుట్టిస్తున్న వేడిగాలులు

హైదరాబాద్‌ సిటీ: భానుడి భగభగలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే నిప్పులు చెరుగుతున్నాడు. గ్రేటర్‌లో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరడంతో బయటకు వచ్చేందుకు నగరవాసులు వణికిపోతున్నారు. ఇంట్లో ఏసీ లేకుండా గంటకూడ ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయని మోతీనగర్‌కు చెందిన రత్నం రాజు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 వరకు వేడిగాలుల కారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతోంది.

ఈ వార్తను కూడా చదవండి: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..


కార్వాన్‌, గోషామహల్‌, ముషీరాబాద్‌, మూసాపేట, హఫీజ్‌పేట, మూసారాంబాగ్‌, హబ్సిగూడ, లింగంపల్లి, యూసుఫ్‏గూడ రహ్మత్‌నగర్‌(Habsiguda, Lingampalli, Yusufguda, Rahmatnagar), రాజేంద్రనగర్‌, వనస్థలిపురం ప్రాంతాల్లో 41.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 30 నాటికి గ్రేటర్‌లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలవరకు నమోదయ్యే అవకాశాలుంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎండలకు ఏసీలు, కూలర్ల వినియోగం పెరగడంతో గ్రేటర్‌జోన్‌లో మంగళవారం విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో 4 వేల మెగావాట్లకు చేరింది.


సాయంత్రం శివార్లలో వర్షం

దిల్‌సుఖ్‌నగర్‌, గడ్డిఅన్నారం(Dilsukhnagar, Gaddi Annaram) ప్రాంతాల్లో సాయంత్రం 10 నుంచి 15 నిమిషాల పాటు వర్షం కురిసింది. గడ్డిఅన్నారం కమలానగర్‌లో ఈదురుగాలులకు భారీ రావిచెట్టు పడటంతో ఓ కారు పాక్షికంగా ధ్వంసమైంది. మరో రెండురోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టీసీలో సమ్మెకు సై...జేఏసీకి సంఘాల మద్దతు

ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై

Singareni: సింగరేణి ఉపకార వేతనం

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 23 , 2025 | 07:20 AM