Electricity: నగరంలో.. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
ABN, Publish Date - Jun 28 , 2025 | 06:56 AM
ఆజామాబాద్ డివిజన్, హైదరాబాద్ సిటీ-1 పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈలు నాగేశ్వరరావు, వినోద్‌కుమార్ తెలిపారు.
హైదరాబాద్: ఆజామాబాద్ డివిజన్(Azamabad Division), హైదరాబాద్ సిటీ-1 పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈలు నాగేశ్వరరావు, వినోద్‌కుమార్ తెలిపారు. ప్రివెంటివ్ మెడిసిన్, మహావీర్ ఓహెచ్, ఏపీ టూరిజం 11కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధుల్లో ఉదయం 10నుంచి మధ్నాహ్నం 1 గంట వరకు, పార్శిగుట్ట పరిధిలో 11నుంచి 11.30 గంటల వరకు, ఆప్కో, రామ్‌లీలా మైదాన్, గెలాక్సీ, శాంతాబాయి నర్సింగ్‌హోమ్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఆనంద్‌నగర్ పరిధిలో 3నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
పేట్‌బషీరాబాద్: కొంపల్లి సబ్‌స్టేషన్(Kompally Substation) పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఈ కింది ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కేవీఆర్ రోడ్డు, విజయశాంతి జాలీ, సినీప్లానెట్ రోడ్డు, ఎన్‌సీఎల్ కాలనీ, నందకాసుపత్రిరోడ్డు, కొంపల్లి గ్రామాల్లో విద్యుత్ ఉండదన్నారు.
ప్రాగాటూల్స్ సబ్-స్టేషన్ పరిధిలో..
మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు సాయిబాబానగర్, ఎంఎన్‌రెడ్డినగర్ ఫేజ్-1,2. వాజ్‌పేయినగర్, పద్మానగర్ ఫేజ్-2, నాగులకుంట, పైప్‌లైన్ రోడ్డులో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ జ్ఞానేశ్వర్ తెలిపారు.
చందానగర్: తారానగర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ శివప్రసాద్ తెలిపారు. వెంకటాద్రినగర్, లింగంపల్లి, పోచమ్మ టెంపుల్ ఎదురుగా ఉన్నరోడ్డు, పీజేఆర్ స్టేడియం, శివాజీనగర్ తారానగర్ విలేజ్ వెనుక రోడ్డు, విద్యానికేతన్ స్కూల్, తారానగర్ మజీద్‌రోడ్డులో విద్యుత్ ఉండదని తెలిపారు. రామాలయ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 వరకు హుడా ట్రేడ్ సెంటర్, ఓల్డ్ లింగంపల్లి, లింగంపల్లి సాయిబాబా టెంపుల్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని డీఈ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం ధర భారీగా తగ్గిందోచ్, కానీ వెండి మాత్రం
ఆర్‌అండ్‌బీలో 72 మంది డీఈఈలకు పదోన్నతి
Read Latest Telangana News and National News
Updated Date - Jun 28 , 2025 | 06:58 AM