Komatireddy Venkatreddy: ఆర్‌అండ్‌బీలో 72 మంది డీఈఈలకు పదోన్నతి
ABN , Publish Date - Jun 28 , 2025 | 04:48 AM
రోడ్లు, భవనాల శాఖలో పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. శాఖలో డిప్యుటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(డీఈఈ)గా ఉన్న 72 మందికి తాజాగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఈఈ)గా..
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): రోడ్లు, భవనాల శాఖలో పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. శాఖలో డిప్యుటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(డీఈఈ)గా ఉన్న 72 మందికి తాజాగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఈఈ)గా పదోన్నతి కల్పించడంతో పాటు వారిలో 64 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు.
వీరిలో ఇద్దరు, ముగ్గురు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. శాఖలో ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో 223 మందికి పదోన్నతులు లభించాయి. కాగా, ప్రజల మన్ననలు పొందేలా ఆర్ అండ్ బీ ఇంజనీర్లు పనిచేయాలని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ముఖ్యమంత్రిని ఒప్పించి ఏ శాఖలో లేని విధంగా తన శాఖలో ప్రత్యేకంగా పదోన్నతులు ఇప్పించానని తెలిపారు.