ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: డగ్స్‌ కేసులో మహిళా వైద్యురాలు అరెస్టు

ABN, Publish Date - May 10 , 2025 | 04:21 AM

ముంబై స్మగ్లర్‌ నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్న ఒక మహిళా వైద్యురాలిని రాయదుర్గం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

రాయదుర్గం/హైదరాబాద్‌ సిటీ, మే9 (ఆంధ్రజ్యోతి): ముంబై స్మగ్లర్‌ నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్న ఒక మహిళా వైద్యురాలిని రాయదుర్గం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆమెకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న స్మగ్లర్‌నూ అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ.5 లక్షల విలువ చేసే 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. షేక్‌పేట్‌లోని అపర్ణ వన్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వైద్యురాలు చిగురుపాటి నమ్రత (34).. కొంతకాలం నుంచి ముంబైలోని వంశ్‌ టక్కర్‌ అనే స్మగ్లర్‌ నుంచి కొకైన్‌ కొనుగోలు చేస్తున్నారు.


ఈ క్రమంలోనే ఇటీవల తనకు డ్రగ్స్‌ పంపాలని కోరుతూ.. వంశ్‌ టక్కర్‌కు రూ.5 లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా పంపారు. వంశ్‌ తన అనుచరుడైన బాలకృష్ణ రామ్‌ప్యార్‌ (38)కు 53 గ్రాముల కొకైన్‌ ఇచ్చి హైదరాబాద్‌కు పంపాడు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు.. గురువారం సాయంత్రం 5గంటల సమయంలో నమ్రతకు బాలకృష్ణ కొకైన్‌ అందజేస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని 53 గ్రాముల కొకైన్‌తోపాటు రూ. 10 వేల నగదు, 2 సెల్‌ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2025 | 04:21 AM